క్రీడాభూమి

రియో ఒలింపిక్స్‌కు ప్రశంసల జల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిన తొలి భజిమ్నాస్ట్ దీప క్వాలిఫైరత మహిళా జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించిన దీప కర్మాకర్‌పై పలువురు ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. యావత్ భారత దేశం గర్వించేలా దీప అసాధారణ ప్రతిభ కనబరచిందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి శర్వానంద సోనోవాల్ ఒక ప్రకటనలో తెలిపారు. దీప ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించడాన్ని ఆయన ఒక చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు. దేశంలోని యువతీయువకులకు ఆమె మార్గదర్శిగా నిలుస్తోందని భారత మాజీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ ట్వీట్ చేశాడు. ఆమెకు శుభాకాంక్షలు తెలిపాడు. 52 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్‌లో భారత్‌కు స్థానం సంపాదించిపెట్టిన జిమ్నాస్ట్ దీప రాణిస్తుందని, పతకాన్ని సాధిస్తుందని మాజీ క్రికెటర్లు వివిఎస్ లక్ష్మణ్, వీరేందర్ సెవాగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
--

రియో డి జెనీరో, ఏప్రిల్ 18: భారత జిమ్నాస్ట్ దీప కర్మాకర్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయిన తొలి భారత మహిళగా చరిత్ర పుటల్లో స్థానం సంపాదించింది. ఇక్కడ జరుగుతున్న ఒలింపిక్ క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో పాల్గొన్న 22 ఏళ్ల దీప 52.698 పాయింట్లు సాధించడం ద్వారా ఈఏడాది ఆగస్టులో జరిగే ఒలింపిక్స్‌కు అర్హత పొందింది. భారత దేశం స్వాతంత్య్రాన్ని సంపాదించిన తర్వాత ఇప్పటి వరకూ 11 మంది జిమ్నాస్టులు మన దేశం తరఫున పాల్గొన్నారు. చివరిసారి 1964లో భారత్ జిమ్నాస్టిక్స్ విభాగంలో పోటీపడ్డారు. వీరంతా పురుషులే కావడం గమనార్హం. ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిన తొలి మహిళా జిమ్నాస్ట్‌గా త్రిపురకు చెందిన దీప సరికొత్త రికార్డు సృష్టించింది. 1952లో ఇద్దరు, 1956లో ముగ్గురు, 1964లో ఆరుగురు జిమ్నాస్ట్‌లో బరిలోకి దిగినప్పటికీ భారత్‌కు పతకాన్ని అందించలేకపోయారు. ఈసారి ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో పోటీపడుతున్న దీప ద్వారా భారత్‌కు పతకం లభిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అర్హత సంపాదించేందుకు నిర్వహించిన క్వాలిఫయర్స్ జాబితాలో దీప 79వ స్థానంలో ఉంది. చాలా కష్టతరమైన ‘ప్రొడునొవా’ వాల్ట్‌లో ఆమె 15.066 పాయింట్లు సంపాదించింది. 14 మంది పోటీపడగా వారిలో దీప నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. కానీ అనీవెన్ బార్స్ విభాగంలో ఆమె విఫల మైంది. 11.700 పాయింట్లతో సరిపుచ్చుకుంది. 14 మంది పోటీదారుల్లో చివరి నుంచి రెండో స్థానానికి పరిమితమైంది. బీమ్‌లో 13.366, ఫ్లోర్ ఎక్సర్‌సైజ్‌లో 12.566 పాయింట్లు సంపాదించిచడం ద్వారా ఆమె ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ మార్క్‌ను అధిగమించింది.
చివరి ప్రయత్నంలో..
గత ఏడాది నవంబర్‌లో జరిగిన ప్రపంచ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్స్‌లో దీప చివరి వరకూ శ్రమించింది. కానీ, ఐదో స్థానంలో నిలవడంతో ఆమె ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించలేకపోయింది. 2014లో జరిగిన గ్లాస్గో కామనె్వల్త్ గేమ్స్‌లో కాంస్య పతకాన్ని సాధించడం ద్వారా ప్రపంచ చాంపియన్‌షిప్స్ ఫైనల్‌లో పోటీపడే అవకాశాన్ని దక్కించుకున్న భారత తొలి మహిళా జిమ్నాస్ట్‌గా రికార్డు నెలకొల్పిన ఆమెకు రియోలో బరిలోకి దిగేందుకు చివరి అవకాశం క్వాలిఫయర్స్ ద్వారా లభించింది. ఇందులో విఫలమైతే దీప ఒలింపిక్స్ ఆశలకు తెరపడేది. కానీ, చివరి అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకుంది. ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించింది.
‘టాప్స్’ సాయం
న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిన దీప కర్మాకర్‌కు అవసరమైన సహాయసహకారాలు అందించేందుకు టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) ముందుకొచ్చింది. ఈ పథకం ద్వారా ఇప్పటికే వివిధ క్రీడా శాఖలకు చెందిన సమర్థులను ఎంపిక చేసి, వారి శిక్షణకు అవసరమై ఖర్చులను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ భరిస్తున్నది. అందులో భాగంగానే దీపకు 30 లక్షల రూపాయలను శిక్షణ అవసరాల నిమిత్తం చెల్లిస్తుంది. త్రిపుర రాజధాని అగర్తల నుంచి వచ్చిన దీప జిమ్నాస్టిక్స్‌లో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తున్నది. రష్యా, చైనా, జపాన్ తదితర దేశాల జిమ్నాస్టులకు దీప ఎంత వరకూ పోటీనిస్తుందో చెప్పలేకపోయినా, ఒలింపిక్స్ స్థాయికి ఎదిగిన ఆమె భారత దేశ కీర్తిపతాన్ని రెపరెపలాడించడం ఖాయంగా కనిపిస్తున్నది. దీప ఒలిం పిక్స్‌లో పతకం సాధిస్తుందని అంతర్జాతీయ రిఫరీ దీపక్ కాగ్రా అంటున్నాడు. పలువురు మాజీ జిమ్నాస్టులు కూడా ఇలాంటి అభిప్రాయానే్న వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద దీప ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించింది.