క్రీడాభూమి

గ్రూప్ అడ్డంకిని అధిగమించేది ఎవరో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, జూన్ 10: ప్రపంచ కప్ సాకర్ చాంపియన్‌షిప్‌ను ఈసారి ఎవరు కైవసం చేసుకుంటారన్న ప్రశ్నకు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. విభిన్నమైన విశే్లషణలు తెరపైకి వస్తున్నాయి. క్వాలిఫయింగ్ రౌండ్‌ను పూర్తి చేసుకొని, మెయిన్ డ్రాకు అర్హత సంపాదించడమే ఒక అద్భుతం. అందుకే, పోటీలో ఉన్న 32 జట్లలో దేనినీ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అయితే, నాకౌట్‌కు ఫలానా జట్లు చేరుతాయని, ఫలానా జట్టుకు టైటిల్ సాధించే అవకాశం ఉందని చేప్పేవారు తమ వాదనను నిరూపించుకోవడానికి ఎన్నో ఉదాహరణలు చూపుతారు. విశే్లషణలు ఇస్తారు. గణాంకాలను అందిస్తారు. ఈసారి వరల్డ్ కప్ ఆరంభానికి ముందు, అదే దృశ్యం పునరావృతమవుతున్నది. ఆతిథ్యదేశమైన రష్యాను మినహాయిస్తే, మిగతా 31 జట్లు క్వాలిఫయర్స్‌లో ఎన్నో ఒడుదుడుకులను అధిగమించి, సవాళ్లను సమర్థంగా ఎదుర్కొని ముందంజ వేసినవే.
ఆతిథ్య దేశం హోదాలో రష్యాకు నేరుగా వరల్డ్ కప్‌లో అవకాశం లభించింది. గ్రూప్ ‘ఏ’ నుంచి రష్యాతోపాటు సౌదీ అరేబియా, ఈజిప్టు, ఉరుగ్వే జట్లు ఢీ కొంటున్నాయి. వీటిలో ఉరుగ్వే, ఈజిప్టు గ్రూప్ టాపర్‌గా నిలుస్తాయని అంచనా. రష్యా, సౌదీ అరేబియాతో పోలిస్తే, ఈ రెండు జట్లు అన్ని విధాలా పటిష్టంగా ఉన్నాయి. ఆస్కార్ తబరెజ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఉరుగ్వే జట్టులో ఎడిసన్ కవానీ కీలక పాత్ర పోషించనున్నాడు. ప్రపంచ అత్యుత్తమ గోల్ కీపర్స్‌లో ఒకడిగా పేరు సంపాదించుకున్న అతను ఏ విధంగా ఆడతాడనే అంశంపైనే ఉరుగ్వే ముందంజ వేసే అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈజిప్టు జట్టుకు హెక్టర్ క్యూపర్ కోచ్‌గా సేవలు అందిస్తుండగా, మహమ్మద్ సలా కీలక ఆటగాడు. క్వాలిఫయర్స్‌ను ఈజిప్టు అధిగమించడంలో అతను కీలక పాత్ర పోషించాడు. మరోసారి జట్టుకు అండగా నిలుస్తాడని ఈజిప్టు అభిమానులు ఆశిస్తున్నారు.
గ్రూప్ ‘బీ’లో పోర్చుగల్, స్పెయిన్, మొరాకో, ఇరాన్ జట్లు పోటీపడుతున్నాయి. మొరాకో, ఇరాన్ కంటే పోర్చుగల్, స్పెయిన్ బలమైన జట్లు అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ప్రపంచ సూపర్ స్టార్ ఫార్వర్డ్ క్రిస్టియానో రొనాల్డో ఒంటిచేత్తో పోర్చుగల్‌ను రౌండ్-16కు చేర్చగల సమర్థుడు. రియల్ మాడ్రిడ్‌కు ఆడుతున్న రొనాల్డో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. కోచ్‌గా ఫెర్నాండో సాంటోస్ 2014లో బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి పోర్చుగల్ అద్వితీయ ప్రతిభను కనబరుస్తున్నది. గ్రూప్ ‘బీ’ నుంచి ఈ జట్టు ప్రీ క్వార్టర్స్ చేరడం ఖాయంగా కనిపిస్తున్నది. ఇక మాజీ చాంపియన్ స్పెయిన్‌లో ఆండ్రెస్ ఇనిస్టా రూపంలో అద్వితీయ ప్రతిభావంతుడు ఉన్నాడు. 2010 వరల్డ్ కప్ ఫైనల్‌లో అతను చేసిన గోల్‌తోనే స్పెయిన్ టైటిల్‌ను అందుకోగలిగింది. జూలెన్ లొపెటెగయ్ కోచ్‌గా ఉన్న ఈ జట్టు కూడా అన్ని విభాగాల్లోనూ బలంగా ఉంది. జట్టు సమతూకాన్ని పాటిస్తున్నారు అధికారులు పాటిస్తున్నారు కాబట్టి, ‘బీ’ గ్రూప్ నుంచి ముందంజ వేసే రెండో జట్టుగా స్పెయిన్‌ను విశే్లషకులు పేర్కొంటున్నారు. మొరాకో, ఇరాన్ జట్లు క్వాలిఫయర్స్ అడ్డంకిని అధిగమించినప్పటికీ, ఏవైనా అనూహ్యమైన ఫలితాలు వస్తేతప్ప లాస్ట్-16లో చోటు దక్కించుకోవడం అసాధ్యం.
గ్రూప్ ‘సీ’లో ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, పెరూ, డెన్మార్క్ జట్లు తలపడుతున్నాయి. సహజంగానే ఫ్రాన్స్, డెన్మార్క్ జట్లను ఈ గ్రూప్ టాపర్స్‌గా విశే్లషకులు ముద్ర వేస్తున్నారు. ఎక్కువ మంది యువ ఆటగాళ్లతో కూడిన ఫ్రాన్స్ జట్టుకు డిడెర్ డెచాంప్స్ కోచ్‌గా ఉన్నాడు. రియల్ మాడ్రిడ్‌కు ఆడుతున్న రాఫెల్ వరానే ఈ జట్టులో కీలక ఆటగాడు. 2006లో ఫైనల్ చేరినప్పటికీ, పెనాల్టీ షూటౌట్‌లో ఇటలీ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్న ఫ్రాన్స్ 2014 వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్‌లో జర్మనీని ఢీకొని ఇంటిదారి పట్టింది. బలమైన జట్లలో ఒకటి కాబట్టి, ఈసారి ప్రీ క్వార్టర్స్‌కు చేరే అవకాశాలను ఈ జట్టుకు ఎక్కువగా ఉన్నాయి. ఇక అగే హరీడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న డెన్మార్క్ కూడా అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ, గ్రూప్ ‘సీ’ నుంచి ప్రీ క్వార్టర్స్ చేరే అవకాశాలు తనకు ఉన్నాయని నిరూపిస్తున్నది. క్రిస్టియన్ ఎరిక్సెన్ ఈ జట్టుకు కీలక ఆటగాడు. 2010లో కేవలం 18 ఏళ్ల వయసులో వరల్డ్ కప్ టోర్నీని ఆడిన అతను ఇప్పుడు ఎంతో అనుభవాన్ని సంపాదించాడు. జట్టును ప్రీ క్వార్టర్స్ చేర్చడంలో అతను కీలక పాత్ర పోషిస్తాడని డెన్మార్క్ అభిమానులు ధీమాతో ఉన్నారు. ఈ గ్రూప్ నుంచి ఆస్ట్రేలియా, పెరూలో ఏదైనా ఒకటిగానీ, లేదా రెండు జట్లుగానీ లాస్ట్-16లోకి అడుగుపెడితే, అది ఒక సంచలనమే అవుతుంది.
గ్రూప్ ‘డీ’లో అందరి కళ్లూ లియోనెల్ మెస్సీపైనే ఉంటాయనేది వాస్తవం. పోర్చుగల్‌ను ముందుకు నడిపించే బాధ్యత క్రిస్టియానో రొనాల్డోపై ఉన్నట్టే, అర్జెంటీనాకు విజయాలు మెస్సీ వల్లే లభిస్తాయని అతని అభిమానులు నమ్ముతున్నారు. ఫామ్‌లో ఉన్న మెస్సీని నిలువరించడం, అతని నుంచి బంతిని లాక్కోవడం ఎవరితరం కాదన్నది వాస్తవం. అందుకే, గ్రూప్ ‘డీ’ నుంచి అర్జెంటీనా టైటిల్ ఫేవరిట్‌గా బరిలోకి దిగుతున్నది. 2014లో ఫైనల్ చేరి, రన్నరప్ ట్రోఫీతో సరిపుచ్చుకున్న అర్జెంటీనా ఈసారి టైటిల్‌నే లక్ష్యంగా ఎంచుకుందనడంలో అనుమానం లేదు. జార్జి సాంపొలీ కోచ్‌గా సేవలు అందిస్తున్న నేపథ్యంలో ఈ జట్టు ఫేవరిట్స్‌లో ఒకటిగా ముద్ర వేయించుకుంది. ‘డీ’ గ్రూప్ నుంచి ఐస్‌లాండ్, క్రొయేషియా, నైజీరియా జట్లు కూడా పోటీలో ఉన్నాయి. వీటిలో గెర్నాట్ రోర్ కోచ్‌గా వ్యవహరిస్తున్న నైజీరియాకు ‘లాస్ట్-16’లో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశీలకుల అంచనా. జాన్ ఒమీ మికెల్ ఈ జట్టులో కీలక ఆటగాడు. ఐస్‌లాండ్, క్రొయేషియా జట్లు ముందంజ వేయాలంటే, అనుకోని ఫలితాలు వెల్లడికావాల్సిందే.
గ్రూప్ ‘ఈ’ నుంచి గతంలో ఐదు పర్యాయాలు చాంపియన్‌గా నిలిచి, ప్రపంచ రికార్డు సృష్టించిన బ్రెజిల్ కూడా హాట్‌ఫేవరిట్‌గా పోటీలోకి దిగుతున్నది. ఈ టోర్నీలో స్టార్ అట్రాక్షన్‌గా నిలుస్తున్న ఆటగాళ్లలో ఒకడైన నేమార్ ఫిట్నెస్ సమస్యను అధిగమించి, పోటీలోకి దిగడం సహజంగానే అభిమానుల్లో ఆశలు పెంచుతున్నది. బార్సిలోనా నుంచి అత్యధిక పారితోషికం మీద పారిస్ సెయింట్ జర్మెయిన్‌కు వలస వెళ్లిన నేమార్ ఒక మ్యాచ్ ఆడుతూ తీవ్రంగా గాయపడడం, ఆతర్వాత కాలికి శస్త్ర చికిత్స చేయించుకోవడం అతను వరల్డ్ కప్‌లో ఆడే అవకాశాలపై అనుమానాలను రేకెత్తించాయి. కానీ, రెండు రోజుల క్రితం ఒక వామప్ మ్యాచ్‌లో ఆడి, ఫిట్నెస్‌ను నిరూపించుకోవడంతో, బ్రెజిల్ ఊపిరి పీల్చుకుంది. అడెనర్ బాచీ కోచ్‌గా ఉన్న ఈ జట్టు ఎలాంటి ఇబ్బందు లేకుండా ‘లాస్ట్-16’లోకి అడుగుపెట్టడం ఖాయం. ఈ జట్టుతోపాటు ముందంజ వేసే అవకాశం ఉన్న మరో జట్టు స్విట్జర్లాండ్. వ్లాదిమిర్ పెట్కోవిచ్ కోచ్‌గా ఉన్న ఈ జట్టులో వలోన్ బెహ్రామీ కీలక ఆటగాడు. అన్ని విభాగాల్లోనూ ఈ జట్టు సమతూకలంగా ఉంది. అందుకే, ‘డీ’ గ్రూప్ నుంచి పోటీపడుతు న్న మిగతా రెండు జట్లు కోస్టారికా, సర్బేరియా కంటే స్విట్జర్లాండ్‌కే ప్రీ క్వార్టర్స్ చేరే అవకాశాలున్నాయని పరిశీలకుల వాదన.
గ్రూప్ ‘ఎఫ్’ నుంచి పోటీపడుతున్న డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ మరోసారి టైటిల్ అందుకోవాలన్న పట్టుదలతో ఉంది. మెక్సికో, స్వీడన్, దక్షిణ కొరియా కూడా ఈ గ్రూప్ నుంచి ‘లాస్ట్-16’లో స్థానం కోసం పోరాడనున్నాయి. అయితే, అన్నిటికంటే ముందు అర్హత సంపాదించే అవకాశం జర్మనీకే ఉంటుందని విశే్లషకుల అంచనా. క్వాలిఫయర్స్‌లో 10 మ్యాచ్‌లు ఆడి, అన్నింటినీ గెల్చుకోవడమేగాక, 43 గోల్స్ సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచిన జర్మనీకి జోచిమ్ లో కోచ్‌గా ఉన్నాడు. రియల్ మాడ్రిడ్‌లో కీలకంగా ఉన్న టోనీ క్రూస్ జర్మనీని విజయపథంలో నడిపించే అవకాశాలున్నాయి. టైటిల్ రేసులో ఉన్న ఈ జట్టుకు గ్రూప్ దశను అధిగమించడం కష్టం కాదనే అంటున్నారు. కాగా, గ్రూప్ ‘ఎఫ్’ నుంచి ‘లాస్ట్-16’కు చేరడం ఖాయంగా కనిపిస్తున్న మరో జట్టు మెక్సికో. జువాన్ కార్లొస్ ఒసొరియో మార్గదర్శంలో రాటుదేలిన ఈ జట్టులో స్టార్ ఆటగాడు జేవియర్ హెర్మాండెజ్ ఉన్నాడు. జర్మనీతోకలిసి మెక్సికో గ్రూప్ దశను పూర్తి చేస్తుందని, స్వీడన్, దక్షిణ కొరియా ఇంటిదారి పట్టక తప్పదని అంటున్నారు.
గ్రూప్ ‘జీ’లో బెల్జియం, ఇంగ్లాండ్, పనామా, ట్యునీషియా జట్లు అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఈ గ్రూపు నుంచి బెల్జియం, ఇంగ్లాండ్ జట్లు ‘లాస్ట్-16’లో చోటు సంపాదిస్తాయన్న వాదన బలంగా వినిపిస్తున్నది. పోరాటాలకు మారుపేరుగా నిలిచే బెల్జియం ఎలాంటి జట్టునైనా సమస్యల్లో పడేస్తుందని చాలా సందర్భాల్లో రుజువైంది. క్వాలిఫయర్స్‌లోనూ ఆ జట్టు అద్భుత ప్రతిభాపాటవాలను ప్రదర్శించింది. రాబర్టొ మార్టినెజ్ శిక్షణలో, అన్ని విభాగాల్లోనూ నైపుణ్యాన్ని పెంచుకున్న ఈ జట్టులో కెవిన్ డి బ్రూన్జ్ కీలక ఆటగాడు. ప్రపంచ మేటి క్రీడాకారుల్లో ఒకడిగా పేరుప్రఖ్యాతులు ఆర్జించిన అతని సామర్థ్యం బెల్జియం జట్టును ప్రీ క్వార్టర్స్‌కు చేర్చడం ఖాయమని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. ఈ గ్రూప్ నుంచి ‘లాస్ట్-16’కు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తున్న మరో జట్టు ఇంగ్లాండ్. గారెత్ సౌత్‌గేట్ కోచ్‌గా ఉన్న ఈ జట్టులో హారీ కేన్ ప్రధాన ఆటగాడు. క్వాలిఫయర్స్‌లో చక్కటి ప్రతిభ కనబరచిన ఇంగ్లాండ్ 2014లో గ్రూప్ దశ నుంచి నిష్క్రమించింది. అదే పరిస్థితి పునరావృతం కాకూడదన్న పట్టుదలతో ఉంది. పనామా, ట్యునీషియా జట్లు గ్రూప్ దశను అధిగమించడం అసాధ్యమని నిపుణులు అంటున్నారు.
గ్రూప్ ‘హెచ్’లో జపాన్, సెనెగల్ కూడా పోటీలో ఉన్నప్పటికీ, ‘లాస్ట్-16’ చేరుకునే అవకాశాలు పోలాండ్, కొలంబియా జట్లకే ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఆడం నవాల్కా కోచింగ్‌లో పోలాండ్ ఆటగాళ్లంతా తమ నైపుణ్యానికి పదునుపెట్టుకొని, వరల్డ్ కప్‌లో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. రాబర్ట్ లెవాండోవ్‌స్కీ యూరోపియన్ సాకర్‌లో బయెర్న్ మ్యూనిచ్ తరఫున ఆడుతున్నాడు. అతనే వరల్డ్ కప్‌లో పోలాండ్‌ను ముందుకు తీసుకెళతాడన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. కాగా, నాలుగేళ్ల క్రితం, 2014 వరల్డ్ కప్‌లో క్వార్టర్ ఫైనల్స్ వరకూ చేరిన కొలంబియా మరోసారి గ్రూప్ దశను సమర్థంగా ముగించుకునే అవకాశాలున్నాయి. జొస్ పెకెర్మన్ కోచ్‌గా ఉన్న జట్టులో జేమ్స్ రోడ్రిగెజ్ కీలక ఆటగాడు. బయెర్న్ మ్యూనిచ్‌కి ప్రాతినిథ్యం వహించే రోడ్రిగెజ్‌కు ఏమాత్రం సహకారం లభించినా, గోల్స్ వరద తప్పదు. అటు డిఫెన్స్‌లోనూ, ఇటు అటాకింగ్‌లోనూ బలంగా కనిపిస్తున్న కొలంబియా ‘లాస్ట్-16’లోకి అడుగుపెట్టడంలో ఎలాంటి అనుమానం లేదని విశే్లషకులు గట్టిగా అంటున్నారు. సెనెగల్, జపాన్ జట్లను తక్కువ అంచనా వేయడానికి వీల్లేకపోయినా, పోలాండ్, కొలంబియా జట్లను అధిగమించి గ్రూప్ ‘హెచ్’లో మొదటి రెండు స్థానాలను దక్కించుకోవడం అసాధ్యమేన్న వాదన వినిపిస్తున్నది. మొత్తం మీద ఈసారి ఫిఫా వరల్డ్ కప్ గతంలో కంటే భిన్నంగా, ఆసక్తికరంగా సాగుతుం దని చాలా మంది అంచనా.