క్రీడాభూమి

ఒరిజినల్ ట్రోఫీ మాయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, జూన్ 10: వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న జట్టుకు బహూకరించే ట్రోఫీని మొదట్లో ‘విక్టరీ’గా పిలిచేవారు. ఆ తర్వాత ఫిఫా అధ్యక్షుడు జూలెస్ రిమెట్ పేరును ఆ ట్రోఫీకి ఖరారు చేశారు. లండన్ స్టాంప్ ఎగ్జిబిషన్‌లో భారీ భద్రత మధ్య ప్రదర్శనకు ఉంచిన ఈ ట్రోఫీ 1966లో అనూహ్యంగా మాయమైంది. గుర్తుతెలియని వ్యక్తులు లోనికి చొరబడి ట్రోఫీని ఎత్తుకెళ్లారు. భద్రతా సిబ్బంది ఎంత ప్రయత్నం చేసినా, ఎంత మంది అనుమానితుల్ని అరెస్టు చేసి ప్రశ్నించినా ఫలితం లేకపోయింది. ఆరు రోజుల అనంతరం అనూహ్యంగా ట్రోఫీ బయటపడింది. డేవిడ్ కార్బెట్ తన కుక్క ‘పికిల్స్’తో కలిసి ఉదయం వాకింగ్‌కు వెళ్లినప్పుడు బ్యూలా హిల్ ప్రాంతంలో ట్రోఫీ కనిపించింది. ఒక న్యూస్ పేపర్‌లో చుట్టి ఉంచిన ట్రోఫీని ‘పికిల్స్’ పదేపదే వాసన చూస్తూ, అక్కడే తచ్చాడడంతో అనుమానం వచ్చిన కార్బెట్ ఆ పార్సిల్‌ను విప్పి చూశాడు. ట్రోఫీ దర్శనం ఇవ్వడంతో దిగ్భ్రాంతి చెందాడు. పోలీసులకు సమాచారం అందించడంతో కథ సుఖాంతమైంది. ‘పికిల్స్’ పేరు ఒక్కసారిగా బ్రిటన్‌లోనేగాక, యావత్ ప్రపంచంలో మారుమోగిపోయింది. ఆ ఏడాది ఇంగ్లాండ్ తొలిసారి వరల్డ్ కప్ గెల్చుకుంది. అంతకు ముందుగానీ, ఆతర్వాతగానీ ఇంగ్లాండ్‌కు ఈ ట్రోఫీ దక్కలేదు.
ఇలావుంటే, జూలెస్ రిమెట్ ట్రోఫీని 1970లో మూడోసారి ప్రపంచ కప్‌ను సాధించినందుకుగాను బ్రెజిల్‌కు శాశ్వతంగా ఇచ్చేశారు. దాని స్థానంలో కొత్తగా తయారు చేసిన ట్రోఫీని ఇప్పుడు బహూకరిస్తున్నారు. అత్యంత అరుదైన గౌరవాన్ని దక్కించుకొని, ఒరిజినల్ ట్రోఫీని బ్రెజిల్ ప్రభుత్వం భద్రంగా దాచుకోలేకపోయంది. 1983లో ట్రోఫీని ఉంచిన గాజు పేటిక నుంచి గుర్తుతెలియని వ్యక్తులు దానిని దొంగి లించారు. ఇప్పటి వరకూ దాని ఆచూకీని బ్రెజిల్ పోలీసులు, నిఘా విభాగం అధికారులు గుర్తించలేకపోయారు. మొత్తానికి జూలెస్ రిమెట్ ట్రోఫీ మాయమై, దాని స్థానంలో ఇటలీకి చెందిన స్టాబిలిమెంటో ఆర్టిస్టికో బెర్టోనీ కంపెనీ కొత్త ట్రోఫీని తయారు చేసింది. 36.8 సెంటీ మీటర్ల ఎత్తు, 6.1 కిలోల బరువు ఉన్న కొత్త ట్రోఫీని కూడా జూలెస్ రిమెట్ పేరునే కొనసాగిస్తున్నారు. ట్రోఫీ ఇప్పుడు ప్రపంచ సాకర్ అభిమానులను అలరిస్తున్నది. విజేత జట్టుకు ఈ ట్రోఫీని బహుమతి ప్రదాన కార్యక్రమంలో అందచేసి, ఆతర్వాత వెంటనే దానిని తిరిగి తీసుకుంటారు. ఫిఫా ప్రధాన కార్యాలయంలో భద్రపరుస్తారు. విజేత పేరు కూడా చెక్కిన నమూనా ట్రోఫీని విజేత జట్టుకు ఇస్తారు.