క్రీడాభూమి

నేమార్‌ను చూసేందుకు ఎగబడిన అభిమానులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోచి, జూన్ 12: బ్రెజిల్ స్టార్, ప్రపంచ నెంబర్ వన్ ఫుట్‌బాల్ ఆటగాడు నేమార్‌ను తిలకించేందుకు వేలాదిమంది అభిమానులు గుమికూడారు. రష్యాలో ఈనెల 14 నుంచి జరుగనున్న వరల్డ్ సాకర్ కప్‌లో పాల్గొనేందుకు వచ్చిన బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టు ఇక్కడి బ్లాక్ సీ రిసార్టులో సేదతీరుతోంది. సోమవారం ఇక్కడి యుగ్ స్పోర్ట్ స్టేడియంలో ఆస్ట్రియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో తమ అభిమాన ఆటగాడు నేమార్‌ను చూసేందుకు దాదాపు ఐదు వేల మంది అభిమానులు, స్థానికులు గుమికూడారు. మంగళవారం రష్యాలో జాతీయ సెలవు దినం కావడంతో అంతా ఫుట్‌బాల్ ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతున్న స్టేడియానికి క్యూ కట్టారు. దీంతో స్టేడియం మొత్తం జనంతో నిండిపోయింది. ఇంత జనసమ్మర్థంలోనూ ఓ బాలుడు పటిష్టమైన సెక్యూరిటీని ఎలాగోలా దాటుకుని బ్రెజిల్ ఆటగాళ్లతోపాటు తన అభిమాన స్టార్ నేమార్ ఆటోగ్రాఫ్ కోసం ప్రయత్నించాడు. చాలామంది అభిమానులు ‘నేమార్..నేమార్’ అంటూ గట్టిగా అరుస్తూ ప్రపంచంలోనే అతి ఖరీదైన ఆటగాడికి మద్దతుగా మద్దతు పలికారు. కాగా, బ్రెజిల్ తన ఓపెనింగ్ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్‌తో ఆదివారం తలపడనుంది.