క్రీడాభూమి

వరల్డ్ కప్ టోర్నీకి హజో దూరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెర్లిన్, జూన్ 15: రష్యా డోపింగ్ వ్యవహారాన్ని బట్టబయలు చేసిన జర్మనీ జర్నలిస్టు హజో సెపెల్ట్ ఈసారి ఫిఫా వరల్డ్ కప్ సాకర్ టోర్నమెంట్‌కు హాజరుకావడం లేదు. భద్రతా కారణలే అందుకు కారణం. రష్యా ప్రభుత్వం వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడుతున్నదని, ఉద్దేశపూర్వకంగా క్రీడాకారులకు ఉత్ప్రేరకాలను అలవాటు చేసిందని హజో సాక్ష్యాధారాలతోసహా బయటపెట్టడంతో యావత్ క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. ఆతర్వాత చోటు చేసుకున్న అనేకానేక పరిణామాలతో పలు అంతర్జాతీయ ఈవెంట్స్‌లో పాల్గొనే అర్హతను రష్యా కోల్పోయింది. ఎంతోమంది ఒలింపియన్లు తాము సాధించిన పతకాలను వెనక్కు ఇవ్వాల్సి వచ్చింది. ఎన్నో రికార్డులు రద్దయ్యాయి. రష్యాను అన్ని రకాలుగా నష్టపరచి, తలదించుకునేలా చేసిన హజో అంటే సహజంగానే అక్కడి సర్కారుకు, అధికారులకు, క్రీడాభిమానులకు ఆగ్రహం ఉంటుంది. అందుకే రష్యాలో భద్రతాపరమైన సమస్యలు ఎదురవుతాయన్న ఆందోళనతో హజో వరల్డ్ కప్‌కు వెళ్లడం లేదు. నిజానికి ఆరంభంలో అతనికి వీసా ఇవ్వడానికి పుతిన్ సర్కారు నిరాకరించింది. అంతర్జాతీయ స్థాయిలో విపరీతమైన ఒత్తిడి పెరగడంతో, గత్యంతరం లేక వీసాను మంజూరు చేసింది. అయితే, రష్యా ప్రభుత్వం వీసాను ఇచ్చినప్పటికీ, వరల్డ్ సాకర్‌కు వెళితే హజోపై దాడులు జరిగే ప్రమాదం ఉందని జర్మనీ నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ టోర్నమెంట్‌ను చూసేందుకు రష్యా వెళితే, అక్కడ క్రీడాభిమానుల నుంచి ప్రణాలకే ప్రమాదం ఉందని స్పష్టం చేశాయి. మ్యాచ్‌లను ప్రసారం చేస్తున్న బ్రాడ్‌కాస్టింగ్ సంస్థల ప్రతినిధులు ఇది వరకే జర్మనీ విదేశాంగ మంత్రి హికో మాస్‌ను కలిసి, హజోను రష్యా వెళ్లకుండా ఆపాలని కోరారు. పరిస్థితి తీవ్రతను గమనించి హజో రష్యా ప్రయాణాన్ని విరమించుకున్నాడు.