క్రీడాభూమి

వరల్డ్ కప్ సాకర్ ఉరుగ్వే బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎకతెరినబర్గ్, జూన్ 15: ఈసారి ప్రపంచ కప్ సాకర్ చాంపియన్‌షిప్‌లో మొదటి మ్యాచ్ హుషారుగా సాగితే, రెండో మ్యాచ్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. గురువారం సౌదీ అరేబియాను రష్యా 5-0 తేడాతో చిత్తు చేస్తే, శుక్రవారం నాటి మొదటి మ్యాచ్‌లో ఉరుగ్వే అతి కష్టం మీద ఈజిప్టుపై 1-0 తేడాతో గెలిచింది. జొస్ గిమెనెజ్ చివరి క్షణాల్లో సాధించిన గోల్‌తో మాజీ చాంపియన్ ఉరుగ్వే ఈసారి పోటీల్లో బోణీ చేసింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు రక్షణాత్మక విధానాన్ని అనుసరించాయ. ప్రత్యర్థులకు గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా ఆడడంపైనే దృష్టిని కేంద్రీకరించాయే తప్ప, దాడులకు దిగాలని ఏ దశలోనూ ఆలోచించలేదు. మితిమీరిన డిఫెన్స్ వ్యూహం ప్రేక్షకులను అసహనానికి గురి చేసింది. ప్రథమార్ధంలో ఒక్క గోల్ కూడా నమోదు కానందున, ద్వితీయార్ధంలో పరిస్థితి మెరుగు పడుతుందని అంతా ఊహించారు. ఇరు జట్లు దాడులకు ఉపక్రమిస్తాయని భావించారు. కానీ, అందుకు భిన్నంగా ద్వితీయార్థంలోనూ అదే పరిస్థితి కనిపించింది. ఒకటిరెండు సందర్భాల్లో తప్ప ఇరు జట్ల ఆటగాళ్లు గోల్స్ కోసం ముమ్మర దాడులకు దిగలేదు. మ్యాచ్ 90వ నిమిషంలో గిమెనెజ్ గోల్ చేయడంతో ఉరుగ్వే గట్టెక్కింది. మొదటి విజయాన్ని నమోదు చేసింది.