క్రీడాభూమి

డిఫెండింగ్ చాంపియన్‌కు గట్టి పోటీ తప్పదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, జూన్ 16: రష్యాలో జరుగుతున్న ప్రపంచ కప్ సాకర్ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం మెక్సికోతో తలపడే డిఫెండింగ్ చాంపియన్ జర్మనీకి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందని క్రీడా పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. గ్రూప్-ఎఫ్ నుంచి పోటీపడుతున్న జర్మనీ, మెక్సికో జట్లు తొలిసారిగా మాస్కో స్టేడియం వేదికగా పోరాడనున్నాయి. గత ఏడాది జరిగిన కానె్ఫడరేషన్స్ కప్ ట్రోఫీలో జర్మనీ 4-1 తేడాతో మెక్సికోను ఒడించింది. అయితే, అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని మెక్సికో ఇపుడు మరింత బలమైన జట్టుగా రూపాంతరం చెందిందని, కనుక ఫిఫా కప్‌లో భాగంగా ఈ రెండు జట్లు తలపడనున్నందున పోరు భీకరంగా ఉండొచ్చని పరిశీలకుల అంచనా. జర్మనీ తమ జట్టులో వివిధ విభాగాల్లో ప్రపంచఖ్యాతిగాంచిన ఆటగాళ్ల ద్వారా బరిలోకి దిగుతోంది. తమ జట్టులో సైతం ఎంతోమంది ప్రఖ్యాత ఆటగాళ్లు ఉన్నారని, వీరందరి సహకారంతో ప్రపంచ చాంపియన్‌కు గట్టి పోటీ ఇస్తామని మెక్సికో బలంగా నమ్ముతోంది. తమను తక్కువగా అంచనా వేయవద్దని, దీనిని తాము చాలా సీరియస్‌గా తీసుకుంటామని మెక్సికో స్పష్టం చేస్తోంది. ఫిఫా వరల్డ్ కప్‌లో తొలి గేమ్‌ను ఆడుతున్న తాము జర్మనీకి గట్టి పోటీ ఇస్తామని ఉద్ఘాటించింది.