క్రీడాభూమి

దటీజ్ రొనాల్డో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోచీ, జూన్ 16: రియల్ మాడ్రిడ్ తరఫున ఆడే పోర్చుగల్ సాకర్ వీరుడు క్రిస్టియానో రొనాల్డో ప్రపంచ వ్యాప్తంగా తనకు కోట్లాది మంది అభిమానులు ఎందుకున్నారనే విషయాన్ని మరోసారి ప్రత్యక్షంగా చూపించాడు. స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్‌తో విజృంభించి, ఈసారి వరల్డ్ కప్‌లో ఆడుతున్న కీలక ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు సంపాదించాడు. చివరి క్షణాల్లో రొనాల్డో చేసిన గోల్ పోర్చుగల్‌ను ఓటమి నుంచి కాపాడిందంటే, ఆ జట్టులో అతను ఎంతటి కీలక పాత్ర పోషిస్తున్నాడో స్పష్టమవుతున్నది. మ్యాచ్ నాలుగో నిమిషంలోనే పెనాల్టీని గోల్‌గా మలచిన రొనాల్డో పోర్చుగల్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆరంభంలోనే ప్రత్యర్థి జట్టు గోల్ చేయడంతో కంగుతిన్న స్పెయిన్ ఎదురుదాడికి దిగింది. పోరాటం తీవ్రతరమైన సమయంలోనే డిగో కోస్టా ద్వారా స్పెయిన్‌కు ఈక్వెలైజర్ లభించింది. స్కోర్లు సమమైన తర్వాత పోర్చుగీస్ ఆటగాళ్లు మళ్లీ ఆధిక్యాన్ని అందుకోవడంపైనే దృష్టి కేంద్రీకరించారు. అనుక్షణం తనదైన శైలిలో వేగంగా కదులుతూ, స్పెయిన్ గోల్‌పోస్టుపై దాడులకు ప్రయత్నిస్తూ రొనాల్డో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. 44వ నిమిషంలో గోల్ చేసి, ప్రథమార్ధం ముగిసే సమయానికి, పోర్చుగల్‌ను 2-1 ఆధిక్యంలో నిలబెట్టాడు.
స్పెయిన్ ప్రతిఘటన
ద్వితీయార్ధంలో స్పెయిన్ ప్రతిఘటన మొదలైంది. పోర్చుగల్ ఆధిక్యానికి గండికొట్టి, తనను తాను నిరూపించుకునేందుకు స్పెయిన్ పోరాటాన్ని ఉద్ధృతం చేసింది. 55వ నిమిషంలో కోస్టా మరోసారి తన జట్టుకు ఈక్వెలైజర్‌ను సంపాదించిపెట్టాడు. స్కోరు సమమైన మూడు నిమిషాల్లోనే నచో ద్వారా స్పెయిన్‌కు మూడో గోల్ లభించింది. 3-2 ఆధిక్యాన్ని అందుకున్న వెంటనే ఆ జట్టు వ్యూహాన్ని మార్చేసింది. రక్షణ వలయాన్ని పటిష్టం చేసి, పోర్చుగీస్ ఆటగాళ్లను, ప్రత్యేకించి రొనాల్డోను నిలువరించడంపైనే దృష్టి కేంద్రీకరించింది. ఈ వ్యూహం ఫలించడంతో సుమారు అరగంట సేపు పోర్చుగల్ ఎంతగా ప్రయత్నించినప్పటికీ గోల్ చేయలేకపోయింది. అయితే, జట్టును ఆదుకునే బాధ్యతను తన భుజాలపై వేసుకున్న రొనాల్డో 88వ నిమిషంలో అద్భుతమైన గోల్‌ను సాధించాడు. మూడోసారి ఇరు జట్లు సమానమైన గోల్స్‌తో సమవుజ్జీలుగా నిలిచాయి. ఆతర్వాత మరో గోల్ నమోదు కాకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.