క్రీడాభూమి

బరిలోకి నేమార్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోచీ, జూన్ 16: ఈసారి ఫిఫా వరల్డ్ కప్‌లో బ్రెజిల్ సూపర్ స్టార్ నేమార్ ఆడతాడా? లేదా? అనే ప్రశ్నకు ఆదివారం సమాధానం లభిస్తుంది. కాలి గాయానికి ఇటీవలే శస్త్ర చికిత్స చేయించుకున్న నేమార్ పూర్తిగా కోలుకున్నాడని, అతను మ్యాచ్‌కి సిద్ధంగా ఉన్నాడని బ్రెజిల్ ఫుట్‌బాల్ అధికారులు ప్రకటిస్తున్నారు. అయితే, తాను 80 శాతం మాత్రమే కోలుకున్నానని నేమార్ స్వయంగా పేర్కోవడంతో, అతని ఫిట్నెస్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతను బరిలోకి దిగే విషయమై ప్రస్తుతం నెలకొన్న సస్పెన్షన్‌కు ఆదివారం తెరపడుతుంది. స్విట్జర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో ఈ స్టార్ ఆటగాడు బరిలోకి దిగుతాడని బ్రెజిల్ అధికారులు ప్రకటించారు. సాకర్ వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధికంగా ఐదు పర్యాయాలు టైటిల్ సాధించిన బ్రెజిల్ ఆరోసారి విశ్వవిజేతగా నిలవాలన్న పట్టుదలతో ఉంది. టైటిల్ వేటుకు అస్తశ్రస్త్రాలను సమకూర్చుకుంది. జట్టులో సమర్థులైన ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నప్పటికీ, ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం పొందిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన నేమార్‌పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ప్రాక్టీస్ సెషన్‌లో అతనిని చూసేందుకు స్టేడియం వద్ద ప్రతి రోజూ అభిమానులు బారులు తీరుతున్నారు. ఇక స్విట్జర్లాండ్‌తో ఆడబోయే తొలి మ్యాచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టేడియంలో రష్యా అభిమానులు ఎక్కువగా ఉంటారన్నది వాస్తవమేగానీ, ఒక గొప్ప ఆటగాడిగా నేమార్‌ను చూసే వారు కూడా అదే స్థాయిలో ఉంటారు. ‘గ్రూప్ ఈ’ నుంచి బ్రెజిల్, స్విట్లర్లాండ్‌తోపాటు సెర్బియా, కోస్టారికా జట్లు కూడా పోటీలో ఉన్నాయి. గ్రూప్ టాపర్‌గా నిలిచి, ‘లాస్ట్-16’లోకి అడుగుపెట్టేందుకు సన్నద్ధమవుతున్న బ్రెజిల్‌లో నేమార్‌పై కీలక ఆటగాడిగా పెద్ద బాధ్యతే ఉంది.