క్రీడాభూమి

గ్రీజ్మన్ ‘డబుల్’ ఆస్ట్రేలియాపై ఫ్రాన్స్ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కజాన్ (రష్యా), జూన్ 16: కీలక ఆటగాడు ఆంటోనీ గ్రీజ్మన్ రెండు గోల్స్‌తో రాణించడంతో, ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ కప్ సాకర్ చాంపియన్‌షిప్ తొలి గ్రూప్ మ్యాచ్‌ని ఫ్రాన్స్ 2-1 తేడాతో గెల్చుకుంది. ఈ టోర్నీలో ఎక్కువ జట్లు అనుసరిస్తున్న రక్షణాత్మక విధానానే్న ఫ్రాన్స్, ఆస్ట్రేలియా కూడా అమలు చేయడంతో ప్రథమార్ధంలో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ఇరు జట్లు నింపాదిగా ఆడుతూ, అభిమానుల ఉత్సాహాన్ని నీరుగార్చాయి. అయితే, ద్వితీయార్ధంలో పరిస్థితి కొంత మెరుగుపడింది. ఫ్రెంచ్ ఆటగాళ్లు క్రమంగా దాడులకు దిగడంతో, పోరు ఆసక్తికరంగా మారింది. మ్యాచ్ 58వ నిమిషంలో గ్రీజ్మన్ తనకు లభించిన పెనాల్టీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, గోల్ సాధించాడు. అయితే, 1-0 ఆధిక్యాన్ని సంపాదించిన ఆనందం ఫ్రాన్స్‌కు ఎక్కువ సేపు నిలవలేదు. మరో నాలుగు నిమిషాల్లోనే ఆస్ట్రేలియా ఆటగాడు మైల్ జెడినాక్ ఈక్వెలైజర్‌ను అందించాడు. ఆతర్వాత రెండు జట్లు ఆధిక్యం కోసం తీవ్రంగా ప్రయత్నించాయి. ఒకరి అవకాశాలను మరొకరు దెబ్బతీసుకుంటూ ఇరు జట్ల ఆటగాళ్లు ముమ్మరంగా పోరాడారు. చివరికి 80వ నిమిషంలో ఫ్రాన్స్‌కు గోల్ లభించింది. తొలి గోల్ చేసిన గ్రీజ్మన్ మరో కీలక గోల్ చేసి, తన జట్టును పటిష్టమైన స్థితిలో నిలిపాడు. ఆధిక్యాన్ని నమోదు చేసిన తర్వాత ఫ్రాన్స్ రక్షణాత్మకంగా ఆడుతూ, మ్యాచ్‌ని 2-1 తేడాతో ముగించింది.
అర్జెంటీనా ‘ప్రాక్టీస్’!
మాస్కో, జూన్ 16: వరల్డ్ కప్ సాకర్‌లో తాను ఆడిన మొదటి గ్రూప్ పోరాటాన్ని అర్జెంటీనా ప్రాక్టీస్ మ్యాచ్‌గా భావించినట్టు కనిపించింది. ఐస్‌లాండ్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌ని 1-1గా డ్రా చేసుకుంది. అర్జెంటీనా దాడులుగానీ, మెస్సీ మెరుపులుగానీ కనిపించకపోవడంతో, ప్రేక్షకులు నిరాశ చెందారు. మ్యాచ్ 19వ నిమిషంలోనే సెర్గియో అగురో మొదటి గోల్ చేసి, అర్జెంటీనాకు 1-0 ఆధిక్యాన్ని అందించడంతో ఈ మ్యాచ్‌పై ప్రేక్షకుల అంచనాలు పెరిగాయి. ఇదే జోరును కొనసాగించి, అర్జెంటీనా గోల్స్ వరద పారిస్తుందని అంతా ఊహించారు. కానీ, అనూహ్యంగా ఐస్‌లాండ్ దాడులకు దిగింది. మరో నాలుగు నిమిషాల్లోనే ఆల్ఫ్రెడ్ ఫినుబొగసన్ ఈక్వెలైజర్‌ను అందించడంతో ఊపిరి పీల్చుకుంది. స్కోర్లు సమమైన తర్వాత అర్జెంటీనా నుంచి ప్రతిఘటన ఎదురవుతుందని, గోల్స్ కోసం ముమ్మరంగా పోరాడుతుందని ప్రేక్షకులు భావించారు. కానీ, అందుకు భిన్నంగా మెస్సీ బృందం డిఫెన్స్‌కు ప్రాధాన్యతనిచ్చింది. ఫలితంగా ప్రథమార్ధంలో మరో గోల్ నమోదు కాలేదు. ద్వితీయార్ధంలో ఇరు జట్లు అరుదుగా దాడులకు ఉపక్రమించాయి. ఎక్కువ శాతం ఆటలో బంతిని తమ ఆధీనంలోనే ఉంచుకోవడానికి ప్రాధాన్యమిచ్చాయి. ఇరు జట్లూ పటిష్టమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని, డిఫెన్సివ్‌గా ఆడడంతో ద్వితీయార్ధంలోనూ గోల్స్ రాలేదు. చివరికి మ్యాచ్ 1-1గా డ్రా అయింది. స్టార్ అట్రాక్షన్‌గా నిలుస్తున్న ఆటగాళ్లలో ఒకడైన క్రిస్టియానో రొనాల్డో హ్యాట్రిక్ సాధిస్తే, అతని కంటే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్న మెస్సీ రాణించలేకపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది.