క్రీడాభూమి

ఖాతా తెరిచిన క్రొయేషియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలినిన్ గ్రాడ్ (రష్యా), జూన్ 17: ఫిఫా వరల్డ్ కప్ 2018లో క్రొయేషియా ఖాతా తెరిచింది. మ్యాచ్ ఆరంభం నుంచీ నైజీరియాపై దూకుడు ప్రదర్శిస్తూ వచ్చిన క్రొయేషియా 1-0తో ఆధిక్యత నిలుపుకుంది. గ్రూప్-డి క్యాటగిరీలో ఆదివారం క్రొయేషియా -నైజీరియా జట్లు తలపడ్డాయి. మ్యాచ్ ప్రథమార్థంలో 32వ నిమిషంలో నైజీరియన్ ఆటగాడు ఎట్బో ఓన్ గోల్ చేయడంతో క్రొయేషియా 1-0 ఆధిక్యాన్ని సాధించింది. జరిగిన పొరబాటును సరిదిద్దుకోవడానికి నైజీరియన్ ఆటగాళ్లు దూకుడుగా ఆడటంతో మ్యాచ్ హోరీహోరీగా సాగింది. ద్వితీయార్థంలో బంతిని తన నియంత్రణలోకి తెచ్చుకున్న నైజీరియన్ ఆటగాళ్లు అటాక్ వ్యూహానే్న అనుసరించారు. కానీ, ఎన్నిసార్లు ప్రయత్నించినా గోల్ చేసే అవకాశం దక్కించుకోలేకపోయారు. నైజీరియాను నియంత్రిస్తూనే 71వ నిమిషంలో క్రొయేషియా అనూహ్య అవకాశాన్ని అందిపుచ్చుకుంది. క్రొయేషియాకు పెనాల్టీ అవకాశం దక్కడంతో, మిడ్‌ఫీల్డర్ లుకా సమర్థంగా ఉపయోగించుకున్నాడు. పెనాల్టీకి గోల్‌గా మలచి మ్యాచ్ ఆధిక్యాన్ని 2-0కి చేర్చాడు. ఆ ఉత్సాహంతో క్రొయేషియా జట్టు నైజీరియాపై పూర్తి నియంత్రణను సాధించింది. నైజీరియాకు గోల్ చేసే అవకాశమే దక్కకపోవడంతో, క్రొయేషియా విజయం సాధించింది.