క్రీడాభూమి

ఆసియా గేమ్స్‌కు భారత ఫుట్‌బాల్ టీమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 17: జకార్తాలో త్వరలో జరుగనున్న ఆసియా గేమ్స్‌లో పురుషుల ఫుట్‌బాల్ టీమ్ ఆడేందుకు అధికారికంగా అనుమతి లభించింది. ఆసియా గేమ్స్ వంటి మెగా ఈవెంట్‌లో పురుషుల ఫుట్‌బాల్ జట్టుకు అనుమతి ఇవ్వాలని జాతీయ కోచ్ స్టీఫెన్ కాన్‌స్టంటైన్ చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఈ విషయం ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌కు అధికారికంగా తెలియజేశారు. అయితే, మహిళల జట్టు విషయంలో సందిగ్ధత నెలకొంది. మహిళల జట్టుకూ గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉందని ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అండర్-23 ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఇప్పటికే 11 మంది ఆటగాళ్లను సిద్ధం చేశామని కోచ్ కాన్‌స్టంటైన్ తెలిపాడు. కోచ్ పర్యవేక్షణలో ఇప్పటికే భారత పురుషుల జట్టు రెండు పెద్ద విజయాలను నమోదు చేసుకున్నందున ఆసియా గేమ్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు మరింత ప్రయోజనం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. పురుషుల జట్టు ఇటీవల ముంబయిలో జరిగిన ఇంటర్ కాంటినెంటల్ కప్‌లో 2-0తో కెన్యాపై ఘన విజయం సాధించడంలో కెప్టెన్ సునీల్ ఛత్రీ కృషి అమోఘమని కోచ్ అన్నాడు. 2019లో ఏఎఫ్‌సీ ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టుకు సన్నద్ధత ఈవెంట్‌గా అభివర్ణించాడు.