క్రీడాభూమి

రెచ్చిపోయన భారత్ కుర్రాళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లీడ్స్, జూన్ 18: ఇంగ్లాండ్ టూర్‌లో భాగంగా భారత క్రికెట్ జట్టు యువకులు చెలరేగారు. సోమవారం ఇక్కడ జరిగిన ముక్కోణపు సిరీస్ తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఎలెవెన్ జట్టుపై భారత్ 125 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (45 బంతుల్లో ఒక సిక్సర్, ఐదు ఫోర్లతో 54), పృథ్వీ షా (61 బంతుల్లో మూడు సిక్సర్లు, ఏడు ఫోర్లతో 70), ఇషాన్ కిషన్ (46 బంతుల్లో రెండు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 50) పరుగులు చేశారు. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 328 పరుగులు చేయగా, అందుకు ప్రత్యర్థిగా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 36.5 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది. భారత్ బౌలర్లలో పేసర్ దీపక్ చాహర్ 7.5 ఓవర్లలో 48 పరుగులిచ్చి మూడు వికెట్లు అక్షర్ పటేల్ ఐదు ఓవర్లలో 21 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నారు. ఇంగ్లాండ్ క్రికెటర్లలో మ్యాచ్యూ క్రిచెలీ (48 బంతుల్లో నాలుగు ఫోర్లతో 40), బెన్ స్లాటెర్ (38 బంతుల్లో ఒక సిక్సర్, ఆరు ఫోర్లతో 37), విల్ జాక్స్ (28 బంతుల్లో రెండు సిక్సర్లు, మరో రెండు ఫోర్లతో 28), జార్జ్ హాన్‌కిన్స్ (29 బంతుల్లో ఒక సిక్సర్, మూడు ఫోర్లతో 27) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్‌లెవరూ ఆశించిన స్కోరు చేయలేకపోయారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ర్యాన్ హిగ్గిన్స్ 10 ఓవర్లలో 50 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు.