క్రీడాభూమి

యో యో తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 19: క్రికెటర్లకు యో యో టెస్టుల తర్వాతే జట్టులోకి ఎంపిక చేయాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పాలక కమిటీ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఒకసారి జట్టులోకి ఆటగాళ్లను ఎంపిక చేసిన తర్వాత యో యో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ టెస్టులో విఫలమైనవారిని తప్పించడంపై ఎప్పటినుంచో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇకపై ఎలాంటి విమర్శలకు తావీయకుండా ఉండేందుకు వీలుగా బీసీసీఐ మంగళవారం ఇక్కడ సమావేశమై తాజా నిర్ణయాన్ని ప్రకటించింది. ఇకముందు క్రికెటర్లకు యో యో పరీక్షలు నిర్వహించిన తర్వాతే జట్టులోకి తీసుకుంటామని బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ, జనరల్ మేనేజర్ సాబా కరీం సమక్షంలో జరిగిన కమిటీ ఆడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) సమావేశంలో పాల్గొన్న చైర్మన్ వినోద్ రాయ్, సభ్యురాలు డయానా ఎడుల్జీ పాల్గొన్న సమావేశంలో నిర్ణయించినట్టు బీసీసీఐ తెలిపింది.
టీమిండియా ఆటగాళ్లు మహమ్మద్ షమీ, అంబటి రాయుడు, సంజూ శాంసన్‌ను ఇంగ్లాండ్‌లో జరిగే భారత్-ఏ టీమ్‌తోపాటు అఫ్గానిస్తాన్ టెస్టులకు తొలుత ఎంపిక చేసి, ఆ తర్వాత యో యో టెస్టుల్లో విఫలమయ్యారంటూ వారిని తప్పించడంపై విమర్శలు చెలరేగిన విషయం తెలిసిందే. షమీ, రాయుడు, శాంసన్‌లను ఇటీవల జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కంటే ముందుగానే అఫ్గానిస్తాన్, ఇంగ్లాండ్ టూర్‌ల కోసం ఎంపిక చేశామని, కానీ ఈ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ప్రాతినిధ్యం వహిస్తుండడం వల్ల అప్పట్లో యో యో టెస్టులు నిర్వహించలేకపోయామని బీసీసీఐ తెలిపింది. అయితే, ఇకముందు ఇలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా తొలుత ఆటగాళ్లకు యో యో పరీక్షలు నిర్వహించిన తర్వాత వారు అందులో పాసైతే ఆయా మ్యాచ్‌లకు ఎంపిక చేస్తామని స్పష్టం చేసింది. ఇదిలావుండగా ఇటీవల జరిగిని యో యో టెస్టుల కారణంగా బెంగళూరులో జరిగిన అఫ్గానిస్తాన్‌తో భారత్ ఆడిన టెస్టు మ్యాచ్‌కు మహ్మద్ షమీ స్థానంలో ఢిల్లీ పేసర్ నవదీప్ సైనీ, ఇంగ్లాండ్ సిరీస్‌కు అంబటి రాయుడు స్థానే సురేష్ రైనాను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.