క్రీడాభూమి

నేమార్ రెడీ ఫర్ ఫైట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోచి (రష్యా), జూన్ 21: బ్రెజిల్ సాకర్ స్టార్ దిగ్గజ ఆటగాడు నేమార్ తన తదుపరి మ్యాచ్‌లో ఆడతాడా? లేదా? అన్న అనుమానం ఎవరికీ అక్కర్లేదని, అతను తప్పకుండా బిగ్ ఫైట్‌లో పాల్గొంటాడని బ్రెజిల్ సాకర్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో తమ తదుపరి మ్యాచ్‌లో కోస్టారికా జట్టుతో బ్రెజిల్ తలపడనుంది. ఇందుకు వీలుగా రెండురోజులపాటు ఈ జట్టు సభ్యులంతా గట్టి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడారు. ఈ ప్రాక్టీస్‌లో నేమార్ ఫ్రీ కిక్స్ తీసుకున్నాడు. రోజంతా బాగా ప్రాక్టీస్ చేశాడు. పూర్తి ఆరోగ్యంతో ఉండడంతో ఆడగలననే గట్టి నమ్మకంతో ఉన్నాడని పేర్కొంది. ఈ సందర్భంగా తమ స్టార్ ఆటగాడు నేమార్ ఆరోగ్య పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నాయని, వచ్చే మ్యాచ్‌లో అతను ఆడే అవకాశం లేదని వస్తున్న వార్తలను ఫెడరేషన్ తీవ్రంగా ఖండించింది. నేమార్ పూర్తి ఫిట్నెస్‌తో ఉన్నాడని, ఎలాంటి పోరులోనైనా తప్పనిసరిగా పాల్గొంటాడని, ఇందులో ఎవరికీ ఎటువంటి సందేహం అవసరం లేదని స్పష్టం చేసింది. కోస్టారికాతో జరిగే మ్యాచ్‌లో నేమార్ తప్పనిసరిగా ఆడతాడని పేర్కొంది. కాగా గత ఆదివారం స్విట్జర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ను 1-1తో బ్రెజిల్ డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో నేమార్ గోల్ చేయడంలో విఫలం కావడంతో మీడియాలో మాత్రం నేమార్ ఫిట్నెస్‌పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని, తదుపరి మ్యాచ్‌లలో ఆడే అవకాశాల్లేవని అంటూ వార్తలు వెలువరించాయి. చివరకు బ్రెజిల్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ నేమార్‌తోపాటు తమ జట్టు ఆటగాళ్లు ఆడిన ప్రాక్టీస్ మ్యాచ్‌ను వీడియో ద్వారా మీడియా ఎదుట ప్రదర్శించడంతో అందరికీ గట్టి నమ్మకం ఏర్పడింది.