క్రీడాభూమి

టీ-20లో ఇంగ్లాండ్ మహిళల రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాంటన్, జూన్ 21: ఇంగ్లాండ్ క్రికెట్‌లో పురుషులు, మహిళల జట్లు రికార్డులను తిరగరాస్తున్నారు. రెండు రోజుల కిందట ఆస్ట్రేలియాతో జరిగిన పురుషుల మూడో వనే్డలో ఇంగ్లాండ్ (481/6) ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఇపుడు తాజాగా మహిళల జట్టు సైతం సరికొత్త రికార్డును తిరగరాసింది. దక్షిణాఫ్రికా-న్యూజిలాండ్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ముక్కోణపు టీ-20 సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాపై మూడు వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసి వరల్డ్ రికార్డు సృష్టించింది. అంతకుముందు ఇదే వేదికపై దక్షిణాఫ్రికాతో జరిగిన టీ-20లో న్యూజిలాండ్ జట్టు వరల్డ్ రికార్డు (216/1) నమోదు చేసింది. దీనిని ఇపుడు ఇదే వేదికపై జరిగిన మరో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మహిళల జట్టు తుడిచేసింది. బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు డానీ వ్యాట్, బీమాంట్ ఇంగ్లాండ్‌కు శుభారంభం ఇచ్చారు. ఈ ఇద్దరూ కలసి తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 147 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వ్యాట్ 36 బంతుల్లో 56, బీమాంట్ 52 బంతుల్లో 116 పరుగులను చెలరేగి చేశారు. ఆ తర్వాత స్కీవర్ 33, బ్రుంట్ 42 కూడా రాణించడంతో ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. ఆ తర్వాత బరిలోకి వచ్చిన దక్షిణాఫ్రికా క్రికెటర్లు ఎవరూ ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయారు. కెప్టెన్ వాన్ నీకెర్క్ 51 బంతుల్లో 72 పరుగులతో ఒంటరిపోరాటం చేసింది. దీంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 129 పరుగులు మాత్రమే చేయగలింది. దీంతో ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌లో 121 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
అంతకుముందు అదేరోజు దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 216 పరుగులు చేసింది. ఆ సమయానికి అంతర్జాతీయ టీ-20లలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా న్యూజిలాండ్ రికార్డు సృష్టించింది. న్యూజిలాండ్ కెప్టెన్ సుజీ బేట్స్ 66 బంతుల్లో 124 అత్యధిక పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. సోఫి డెవైన్ 73 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల నష్టానికి 150 పరుగులు మాత్రమే చేసింది. దీంతో న్యూజిలాండ్ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ముక్కోణపు సిరీస్‌లో దక్షిణాఫ్రికా జట్టు ఇటు న్యూజిలాండ్, అటు ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇంగ్లాండ్ క్రికెటర్ టామీ బీమోంట్ ఈ మ్యాచ్‌లో 16 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 116 వ్యక్తిగత పరుగులు చేసిన విషయం తెలిసిందే. అయితే, మరో రెండు పరుగులు చేసి ఉంటే మహిళల టీ-20లో వ్యక్తిగత అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా చరిత్రలో నిలిచేది.