క్రీడాభూమి

మాస్కోకు రొమాంటిక్ మాస్క్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, జూన్ 21: మాస్కోలోని ఓ అందమైన పార్క్. ఆహ్లాదకరమైన మిట్టమధ్యాహ్నం. పార్కులో కూర్చున్న అర్జెంటీనా జట్టు అభిమాని అగస్టీన్ ఓటెలో మాత్రం ఓ బెంచ్‌మీద కూర్చుని ఉన్నాడు. వాస్తవ ప్రపంచంతో సంబంధం లేదన్నట్టు ఊహా ప్రపంచంలో విహరిస్తూ ఏవేవో లెక్కలు వేసుకుంటున్నాడు. సహజంగానే పార్కులో అటూ ఇటూ తిరుగుతున్న వాళ్లంతా వరల్డ్ కప్‌లో అభిమాన దేశం ఎన్ని గోల్స్ వేసిందో లెక్కలేసుకుంటున్నాడని అనుకుంటున్నారు. కానీ, అక్కడ అతని లెక్కలు వేరు. రష్యాలోని అందమైన అమ్మాయిల నుంచి సేకరించిన ఫోన్ నెంబర్లను లెక్కలేస్తున్నాడు. విషయం తెలిసిన స్నేహితులు ఫక్కున నవ్వారు. లెక్కలు తీస్తే.. అర్జెంటీనా డ్రెస్ కోడ్‌లో అమాయకంగా కనిపిస్తున్న పాతికేళ్ల కుర్రాడి దగ్గరవున్న ఫోన్ నెంబర్లు లెక్కలేనన్ని. ‘ఏమో, అదృష్టం బావుంటే నా లవ్వు ఇక్కడే వర్కవుట్ అవుతుందేమో. నా లైఫ్ పార్టనర్ రష్యాలోనే ఉందేమో’ అంటూ చమత్కరించాడు ఒటేలో. ఇదేంపనయ్యా? అని ప్రశ్నించే వాళ్లకు ఆ యువ ఇంజనీర్ ఇచ్చే సమాధానం ఇదీ ‘మ్యాచ్‌ల మధ్య ఖాళీ సమయంలో ఏం చేయాలో అర్థంకావడం లేదు. అందుకే ఈ ఆలోచన చేశా. అందమైన రష్యాను అర్థం చేసుకుని ప్రేమించాలంటే అమ్మాయిలతో స్నేహం చేయాలి. ఆ ఆలోచన రావడంతోనే ఫోన్ నెంబర్లు సేకరిస్తున్నా’. అందమైన రష్యన్ గాళ్స్‌తో వివిధ భంగిమల్లో దిగిన సెల్ఫీలను టిండర్ డేటింగ్ యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు మ్యాచ్‌లు చూడ్డానికి మాస్కోకు వెళ్లిన అర్జెంటీనా అభిమాన కుర్రాళ్లు.
‘అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయానికి ఇక్కడ విపరీతమైన కాంపిటీషన్. ఎందుకంటే, మ్యాచ్‌లు చూడ్డానికి రష్యా చేరుకున్న వాళ్ల సంఖ్య తక్కువేమీ లేదు’ అంటున్నాడు ఒటెలో. ‘ఇక్కడ చాలా కొద్దిమంది అమ్మాయిలు మాత్రమే ఇంగ్లీష్, స్పానిష్ మాట్లాడుతున్నారు. అయినా, సైట్ కొట్టుకోడానికి భాషతో పనేముంది. ఇక్కడ అమ్మాయిల సంఖ్య తక్కువేమీ లేదు. అందుకే అందమైన రష్యన్ అమ్మాయిలను కలుసుకుని మాట్లాడటానికి, ఫ్రెండ్షిప్ చేయడానికి వివిధ దేశాల నుంచి వచ్చిన ఫుట్‌బాల్ అభిమానులు మాస్కో వీధుల్లో రొమాంటిక్ మూడ్‌తో తిరుగుతున్నారు.
ఐ లవ్ రష్యా’ అంటూ చమత్కరించాడు మరో అర్జెంటీనా అభిమాని. అయితే, ఈ పరిమాణాల పట్ల కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని రష్యన్ గాళ్స్‌ను హెచ్చరించింది కమ్యూనిస్ట్ శాసనకర్త తమరా ప్లెంటేవా. ‘్ఫట్‌బ్యాల్ మ్యాచ్‌లు చూడ్డానికి వచ్చిన వివిధ దేశాల అభిమానులతో హద్దుల్లో మసలండి. లేదంటే జాతి సంకరమయ్యే ప్రమాదం కొని తెచ్చుకున్నట్టే’ అంటూ చమత్కార హెచ్చరిక చేసింది పార్లమెంట్‌లో స్ర్తిశిశు సంక్షేమ శాఖ కమిటీలో సభ్యురాలైన తమరా. అయితే, అల్ట్రా నేషనలిస్ట్ ఎల్‌డిపీఆర్ పార్టీకి చెందిన ఎంపీ మిఖాయిల్ డెగ్‌త్యర్యోవ్ మాత్రం భిన్నమైన వ్యాఖ్యలు చేశాడు. ‘ప్రపంచ కప్‌ను గెలుచుకునేది ఏదోక దేశం మాత్రమే. కానీ, మైదానం వెలుపల ఎన్ని ప్రేమ కథలు గెలవబోతున్నాయో. కొత్త జనరేషన్ మన మధ్యకు రావడం మహా సంబరమే’ అంటూ వ్యాఖ్యానించాడు. రష్యా అధ్యయుడు వ్లాదిమిర్ పుతిన్ అధికార ప్రతినిధి డ్మిర్టీ పెస్కోవ్ దీనిపై వ్యాఖ్యానిస్తూ ‘రష్యా యువతులు తెలివైన వాళ్లు. వాళ్ల వ్యవహారాలు వాళ్లు చట్టబెట్టుకోగలుగుతారు. ప్రపంచం మొత్తంమీద మనవాళ్లు ది బెస్ట్’ అంటూ కితాబునిస్తున్నాడు.
రొమాన్స్ బావుంది..!
‘సెలవుల రొమాన్స్ బావుంది. ఈ తరుణం కోసమే చాలాకాలంగా ఎదరు చూస్తున్నా. నిజానికి మాకు బహుళ అవకాశాలు. వరల్డ్ మ్యాచ్‌ల్ని ఆనందించొచ్చు. వాటిని చూడ్డానికి వచ్చిన విదేశీ వ్యక్తుల్ని కలుసుకోవచ్చు. ఆ అవకాశం మిస్ చేసుకోకూడదని ఈమధ్యే ఇంగ్లీష్ క్లాసులు సైతం తీసుకున్నా’ అంటోంది మారియాగా పరిచయం చేసుకున్న పాతికేళ్ల రష్యన్ యువతి. ఒకపక్క మ్యాచ్‌ల ఆనందం, మరొపక్క ఆతిధ్య దేశం అందాలతో విదేశీయుల రొమాన్స్.. వెరసి రష్యా ‘లవ్’లో పడినట్టే కనిపిస్తోంది.
జింబాబ్వే క్రికెటర్లకు ఫిట్నెస్ పరీక్ష
కరాచీ, జూన్ 21: పాకిస్తాన్ క్రికెట్ జట్టు సీనియర్ లెగ్‌స్పిన్నర్ యాసిర్ షా, బాబర్ అజామ్‌లకు ఈ వారాంతంలో ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈనెల 28న జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌లో పాల్గొననున్న క్రికెటర్లలో ఆల్‌రౌండర్ యాసిర్, ఇమ్మాద్ వాసిమ్, పేసర్ రుమ్మన్ రరుూస్, బాబర్ ఆజమ్‌లకు బహుశా ఈనెల 23న ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించనున్నారు. గాయం కారణంగా ఐర్లాండ్, ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు టూర్‌లకు యాసిర్, లార్డ్స్ మైదానంలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో చేతికి ఫ్రాక్చర్ కారణంగా బాబర్ దూరమయ్యారు.
ఇపుడు టీమ్ సెలక్టర్లు వీరిద్దరితోపాటు ఇమ్మద్, రుమ్మన్‌లకు కూడా ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించడ ద్వారా జింబాబ్వే టూర్‌కు పంపాలని పాకిస్తాన్ క్రికెట్ యోచిస్తోంది.