క్రీడాభూమి

డెన్మార్క్-ఆస్ట్రేలియా మ్యాచ్ డ్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో: ఫిఫా వరల్డ్ కప్‌లో ఫేవరిట్‌గా బరిలోకి దిగిన డెన్మార్క్‌కు నిరాశ ఎదురైంది. గురువారం ఇక్కడి సమర స్టేడియంలో గ్రూప్-సీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ను డెన్మార్క్ 1-1తో డ్రా అయంది. కీలకమైన ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా నాకౌట్‌కు వెళ్లాలని భావించిన డెన్మార్క్‌కు ప్రత్యర్థి జట్టు తీవ్ర ప్రతిఘటన ఇచ్చింది. మ్యాచ్ ఆరంభం నుంచే డెన్మార్క్‌తో హోరాహోరీగా తలపడిన ఆస్ట్రేలియా మ్యాచ్ పూర్తయ్యేవరకు అదే దూకుడు కొనసాగించింది. మ్యాచ్ ఆరంభమైన 7వ నిమిషంలో డెన్మార్క్ మిడ్‌ఫీల్డర్ క్రిస్టియన్ ఎరిక్‌సన్ జట్టుకు తొలిసారి గోల్‌ను అందించాడు. దీంతో అప్రమత్తమైన ఆస్ట్రేలియా అడుగడుగునా ప్రత్యర్థిని నిలువరిస్తూ దాడులకు పాల్పడింది. దీంతో ఆట 37వ నిమిషంలో ‘వార్’ రూపంలో ఛాన్స్ దక్కడంతో ఆస్ట్రేలియాకి పెనాల్టీ లభించడంతో ఈ జట్టు ఆటగాడు జిద్నాక్ 38వ నిమిషంలో పెనాల్టీని గోల్‌గా మలచి స్కోరును సమం చేశాడు. ఆట ద్వితీయార్ధంలోనూ ఇరు జట్లు మరో గోల్ కోసం ఆపసోపాలు పడ్డాయి. అయినా ఫలితం దక్కలేదు.
ఆస్ట్రేలియా బంతిని తమ ఎక్కువసేపు నియంత్రణలో పెట్టుకోవడంతో మరో గోల్ నమోదు కాలేదు. ఆట చివరివరకూ ఆస్ట్రేలియా తన ప్రత్యర్థిని ముప్పతిప్పలు పెట్టినా, బంతిని ఎక్కువసేపు తమ ఆధీనంలో ఉంచుకున్నా రెండో గోల్‌ను చేయకపోయింది. ఆట సమయం ముగిసేసరికి ఇరు జట్ల స్కోరు 1-1గా ఉండడంతో మ్యాచ్ డ్రా అయింది.