క్రీడాభూమి

మెరిసిన మెక్సికో దక్షిణ కొరియాపై 2-1తో విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రొస్టోవ్ ఆన్ డాన్ (రష్యా), జూన్ 23: ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ జర్మనీకి చుక్కలు చూపించిన మెక్సికో శనివారం దక్షిణ కొరియాతో గ్రూప్-ఎఫ్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో 2-1తో ఘన విజయం సాధించింది. మెక్సికో స్టార్ ఆటగాడు హెర్నాండెజ్ తమ దేశం తరఫున ఇంతవరకు 104 మ్యాచ్‌లు ఆడగా దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో గోల్ చేయడంతో అతని ఖాతాలో మొత్తం 50 గోల్స్ నమోదయ్యాయి. ఆట ప్రథమార్థం నుండే మెక్సికో ప్రత్యర్థికి తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతోపాటు దాడులకు దిగింది. దీంతో ఆట 26వ నిమిషంలో అందివచ్చిన పెనాల్టీని అవకాశంగా మల్చుకుని కార్లోస్ గోల్ చేసి జట్టుకు శుభారంభం అందించాడు. 66వ నిమిషంలో ఇదే జట్టు స్టార్ స్ట్రయికర్ హెర్నాండెజ్ మరో గోల్ చేసి, జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆట చివరి నిమిషంలో (90+3) దక్షిణ కొరియా ఆటగాడు హ్యూంగ్‌మిన్ గోల్ చేసినా ఫలితం లేకపోయింది.