క్రీడాభూమి

షకిరి.. శుక్రియా!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కిలినిన్‌గ్రాడ్, జూన్ 23: గోల్ చేసిన ఆటగాడు గర్జించటం ప్రపంచకప్‌లో సర్వసాధారణం కావొచ్చు. కానీ, ఆ గర్జనకు అర్థం, సంకేతానికి పరమార్థం ఉంటే.. కచ్చితంగా చర్చకు తావిస్తుంది. కిలినిన్‌గ్రాడ్ వేదికగా శుక్రవారం అర్థరాత్రి స్విట్జర్లాండ్ -సెర్బియా జట్ల మధ్య సాగిన ఫుట్‌బాల్ యుద్ధమే ఇందుకు నిదర్శనం. మ్యాచ్‌లో స్విస్ జట్టు 2-1 తేడాతో సెర్బియాపై విజయం సాధించింది. తొలుత మ్యాచ్ ప్రథమార్థంలోనే పోరాట పటిమ ప్రదర్శించిన సెర్బియా, అలెగ్జాండర్ మిట్రోవిక్ సాధించిన గోల్‌తో ఆధిక్యత చాటుకుంది. ద్వితీయార్థంలో స్విస్ డిఫెండర్ గ్రానిక్ హాకా గోల్ సాధించి స్కోరును సమం చేశాడు. తరువాత ఇరు జట్ల మధ్య సాగిన పోరులో ఎవ్వరికీ గోల్ దక్కలేదు. ఆట టై అయిందనుకుంటున్న సమయంలో స్విస్ మిడ్‌ఫీల్డర్ షకిరి మెరుపు మెరిపించాడు. చివరి క్షణాల్లో వేసిన గోల్ ఆటపరంగా రొటీన్ కావొచ్చు. కానీ, నేపథ్యాన్ని పరికిస్తే పెద్ద కథే కనిపిస్తుంది. అదేంటంటే.. ప్రపంచకప్ ప్రారంభానికి కాస్త ముందుకెళ్తే.. స్విస్ మిడ్‌ఫీల్డర్ జెర్డాన్ షకిరి టోర్నమెంట్‌లో తను వేసుకోబోయే బూట్లను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు. అప్పుడే అతని కుడికాలి బూట్ పతాక శీర్షికలకెక్కింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో అతని ఎడమకాలి బూటు, గోల్ తరువాత చేసిన విజయ గర్జన చారిత్రక కథలోకి తీసుకెళ్లింది. ఎలా అంటే, స్విస్ లైనప్‌లో ముగ్గురు ఆటగాళ్లు కొసొవొ ప్రాంత నేపథ్యంనుంచి వచ్చిన వాళ్లు. అంటే అల్బేనియన్ ప్రావిన్స్ జాతీయులన్న మాట. సెర్బీ డామినేషన్ నుంచి తమకు స్వాతంత్య్రం కావాలంటూ 1990ల్లో యుగోస్లోవ్ దళాలపై యుద్ధం చేసిన జాతి వాళ్లది. షకిరి తన జాతి నేపథ్యాన్ని మర్చిపోలేదు. అందుకే, ప్రపంచ కప్‌కు ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో అతను పోస్ట్ చేసిన బూట్లు సంచలనమయ్యాయి. ఎడమకాలి బూట్ హీల్‌మీద స్విస్ ఫ్లాగ్‌ను ప్రదర్శించాడు. మరి కుడి బూట్ మీద -కొసోవో ఫ్లాగ్ పెట్టుకున్నాడు. -సెర్బియా ఆఫ్‌సైడ్ ట్రాప్‌ను చేధించి, గోల్‌కీపర్‌కు చెమటలు పట్టేలా ఎడమ కాలి కిక్‌తో అద్భుతమైన గోల్ చేశాడు షకిరి. గోల్ తరువాత షకిరి రెండు చేతి వేళ్లను ఈగల్ మాదిరి విజయ సంకేతం ప్రదర్శించటం కూడా సంచలనమైంది. అది అల్బేనియన్ జాతి ముద్రకు చిహ్నమన్నది తెలిసిందే. మ్యాచ్ తరువాత ఇదే విషయంపై షకిరిని ప్రశ్నించినపుడు అతనిచ్చిన సమాధానం ‘్ఫట్‌బాల్‌లో అనేక భావోద్వేగాలుంటాయి. నా భావోద్వేగాన్ని మీరు చూశారు. అంతే’ అన్నాడు. సెర్బియా -స్విట్జర్లాండ్ జట్ల మధ్య శుక్రవారం కిలినిన్‌గ్రాడ్ మైదానంలో సాగిన పోరు దాదాపు చారిత్రక యుద్ధాన్ని గుర్తు చేసింది. స్విస్‌కు గోల్ అందించిన షకిరి, డిఫెండర్ వలోన్ బెహ్మ్రి, గ్రానిట్ గ్జకాలు కొసొవో ప్రాంతీయ నేపథ్యం ఉన్నవాళ్లే. అందుకే బెహ్మ్రి శరీరంపై కొసొవో ఫ్లాగ్‌తో అతి పెద్ద టాటూ కనిపించింది. షకిరి చేసిన సంజ్ఞ కొసొవర్ అల్బేనియన్ ఉనికిని గుర్తు చేస్తోందంటూ సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అవుతోంది. నిజానికి శుక్రవారం అర్థరాత్రి కిలినిన్‌గ్రాడ్ స్టేడియం సెర్బియా మద్దతుదారులతోనే నిండిపోయింది. మరోపక్క రషన్లు సైతం సెర్బియాకు మద్దతు పలకడంతో స్విట్జర్లాండ్ సైలెంట్ యుద్ధానే్న ఆరంభించింది. చివరకు షకిరి ఇచ్చిన షాక్‌తో స్టేడియం నుంచి సెర్బియా అభిమానులు వౌనంగా నిష్క్రమించక తప్పలేదు.