క్రీడాభూమి

ఆరేసిన ఇంగ్లాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిఫా వరల్డ్‌కప్ గ్రూప్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ అప్రతిహత విజయాలు నమోదు చేసింది. ఆదివారం పసికూన పనామాను రికార్డు గోల్స్ (6-1)తో చిత్తుచేసి నాకౌట్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌తో ఇంగ్లాండ్ రికార్డులను తిరగరాసింది. హ్యాట్రిక్ గోల్స్‌తో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ కేన్ రికార్డుల మోత మోగించాడు.
*
నిజ్ని నోవ్‌గొరోడ్, జూన్ 24: ఇంగ్లాండ్ రెచ్చిపోయింది. వోల్గా నది ఒడ్డు సాక్షిగా నెజ్ని నోవ్‌గొరోడ్ మైదానంలో ఆదివారం చెలరేగిపోయింది. ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ అప్రతిహత విజయంతో నాకౌట్‌కు చేరుకుంది. ఇప్పటికే నాకౌట్‌కు చేరుకున్న బెల్జియంతో కిలినిన్‌గ్రాడ్ స్టేడియంలో గురువారం తలపడనుంది. ఓడిన పనామా నాకౌట్‌కు రాకుండానే ఇంటిముఖం పడితే, ఇదే గ్రూప్‌లోని టునీషియా సైతం ఇంటిదారి పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రెండు జట్లూ ఇక నిష్క్రమించినట్టే. ఇదిలావుంటే, ప్రపంచకప్ చరిత్రలోనే అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించిన ఇంగ్లాండ్, పసికూన పనామాను తుత్తునియలు చేసింది. గ్రూప్-జిలో నోజ్ని నోవ్‌గొరోడ్ వేదికగా సాగిన పోరులో 6-1 తేడాతో ఇంగ్లాండ్ తన ఘన విజయాన్ని నమోదు చేసింది. కెప్టెన్ హ్యారీ కేన్ హ్యాట్రిక్ గోల్స్‌తో (22, 45, 62 నిమిషాల్లో) చెలరేగిపోయాడు. హ్యాట్రిక్ గోల్స్‌తో ఫిఫా ప్రపంచకప్ టోర్నమెంట్ మొత్తంలో ఇప్పటి వరకూ అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా రికార్డు నమోదు చేసుకున్నాడు. అంతేకాదు, 1986 ప్రపంచకప్ పోరులో హ్యాట్రిక్ గోల్స్ సాధించిన గ్యారీ లినేకర్ రికార్డును హ్యారీ కేన్ సమం చేశాడు. ఇంగ్లాండ్ తరఫున మొదటిసారి ఆడుతున్న డిఫెండర్ జోన్ స్టోన్స్ (8, 40 నిమిషాల్లో) రెండు గోల్స్, జెస్సె లింగార్డ్ (36వ నిమిషంలో) సాధించిన గోల్‌తో ఇంగ్లాండును పూర్తిస్థాయి ఆధిక్యస్థాయికి చేర్చారు.
ఆట ఆరంభం నుంచే పసికూన పనామాపై ఆటాకింగ్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్, ఏ దశలోనూ పనామా ఆటగాళ్లకు అవకాశం ఇవ్వలేదు. బంతిని పూర్తిగా నియంత్రణలో పెట్టుకుని మైదానంలో చెలరేగిపోయారు. ఇంగ్లాండ్ సాధించిన ఘన విజయంతో పసికూన పనామా ఇంటికెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. తుది 16 జాబితాలోకి బెల్జియం చేరిపోవడంతో, అటు టునీషియా సైతం ఆరంభ మ్యాచ్‌ల నుంచే ఇంటికెళ్లే పరిస్థితి వచ్చింది. ప్రథమార్థం 8వ నిమిషంలో జోన్ స్టోన్స్ అద్భుత గోల్ సాధించి ఇంగ్లాండ్‌ను ఆధిక్యంలో నిలబెట్టాడు. డిఫెండర్ స్టోన్స్ కార్నర్ షాట్‌ను గోల్‌గా మలిచడంలో తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించాడు. ఆ తరువాత పనామా డిఫెన్స్‌ను పూర్తిగా చిన్నాభిన్నం చేసి ఇంగ్లాండ్ చెడుగుడు ఆడేసింది. సులభంగానే గోల్స్ సాధించటంతో మ్యాచ్ అర్థ్భాగం సమయానికే ఇంగ్లాండ్ 5-0 తేడాతో తిరుగులేని ఆధిక్యానికి చేరుకుంది. రెండో అర్థ్భాగంలోనూ ఇంగ్లాండ్ జోరు ఏమాత్రం తగ్గలేదు. 62వ నిమిషంలో కెప్టెన్ కేన్ సాధించిన హ్యాట్రిక్ గోల్‌తో ఇంగ్లాండ్ తిరుగులేని ఆధిక్యానికి చేరిపోయింది. ఇంగ్లాండ్ దూకుడును నియంత్రించేందుకు పసికూన పనామా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తీవ్ర ఒత్తిడితో ఆట ముగించిన పనామాకు మిడ్‌ఫీల్డర్ బల్వోయి అందించిన అద్భుతమైన గోల్ ఒక్కటే ఊరట అయ్యింది. ప్రపంచ కప్ చరిత్రలో పనామా జట్టుకు ఇదే తొలి గోల్ కూడా.

చిత్రం..పనామాపై విజయోత్సాహం ప్రదర్శిస్తున్న ఇంగ్లాండ్ జట్టు