క్రీడాభూమి

కిక్.. కిక్.. క్రూస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోచి, జూన్ 24: ఫిఫా ప్రపంచకప్ ఫుట్‌బాల్ క్షేత్రంలోకి హాట్ ఫేవరేట్‌గా దిగిన జర్మనీ గ్రూప్ మ్యాచ్‌ల నుంచే ఇంటికెళ్లిపోయేదా? 1938 తరువాత ఏ ప్రపంచకప్‌లోనూ ఫస్ట్‌రౌండ్ నుంచే ఇంటికెళ్లే పరిస్థితి కొనితెచ్చుకోని జర్మనీ, ఈసారి వెళ్లిపోయి ఉండేదా? కలిసొచ్చే కాలంలో నడిచొచ్చే క్రూస్‌లాంటి ఆటగాడు లేకపోయివుంటే, జర్మనీ అంతటి పరాభవాన్నీ చవిచూసేదేమో. కలిసొచ్చిన ఇంజ్యూరీ టైంలో కాలి లాఘవాన్ని ప్రదర్శించి క్రూస్ తన్నిన కిక్ గోల్ పాయింట్‌లోకి వెళ్లింది కాబట్టి సరిపోయింది. లేదంటే, మాజీ చాంపియన్ వౌనంగా ఇంటి ముఖం పట్టి ఉండేదేమో. నిజానికి జర్మనీకి ఆ పరిస్థితి మిడ్‌ఫీల్డర్ క్రూస్ వల్లే తలెత్తింది. అలాంటి భయానక పరిస్థితి నుంచి మళ్లీ క్రూసే, జర్మనీని గట్టెక్కించాడు. ఇదీ విశేషం. సోచిలోని ఫిష్ట్ మైదానంలో శనివారం అర్థరాత్రి స్వీడన్‌తో తలపడిన జర్మనీ, కలిసొచ్చిన అదృష్టంతో గట్టేక్కింది. తుది పదహారు జట్లలో స్థానానికి అవకాశాలు పదిలపర్చుకుంది. ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్‌ల నుంచే జర్మనీ ఇంటికెళ్లిపోవడంలాంటి పరిస్థితిని అభిమానులు ఊహకైనా జీర్ణించుకోలేరు. అందుకే, అలాంటి ఆలోచనలకే అవకాశం ఇచ్చేదిలేదంటూ జర్మనీ మిడ్‌ఫీల్డర్ క్రూస్ అద్భుతమైన గోల్ పాయింట్ అందించి జర్మనీ జయకేతనాన్ని ఎగురవేశాడు. నిజానికి ఆట ప్రథమార్థంలో క్రూస్ చేసిన చిన్న పొరబాటును స్వీడన్ స్ట్రయికర్ ఓలా టియోవెనిన్ అద్భుత అవకాశంగా మలచుకున్నాడు. 32వ నిమిషంలో అందివచ్చిన అవకాశాన్ని గోల్‌గా మలచి స్వీడన్‌ను ఆధిక్యంలో నిలబెట్టాడు. రెండు జట్లూ దూకుడుగా మొదలెట్టిన మ్యాచ్‌లో బంతి తమ నియంత్రణలోనే ఉన్నా స్వీడన్ తొలి గోల్ సాధించటంతో జర్మనీపై వత్తిడి పెరిగింది. అయితే ద్వితీయార్థం మ్యాచ్ ప్రారంభమైన కొద్ది సమయానికే జర్మన్ ఆటగాడు మార్కో ర్యూస్ గోల్ సాధించి జర్మనీని సమం చేశాడు. అయినప్పటికీ జర్మనీ ఒత్తిడితోనే మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. మ్యాచ్ టై అయితే, వచ్చే బుధవారం దక్షిణ కొరియాతో జరిగే మ్యాచ్‌లో అనివార్యంగా విజయం సాధించాలి. అయినా తుది 16 జట్లలో స్థానానికి అవకాశాలు సజీవంగా ఉంటాయన్న నమ్మకం లేదు. రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అనిపించుకున్న జర్మనీపై ఈ పరిస్థితి మరింత తీవ్ర వత్తిడి పెంచింది. బంతిని తమ నియంత్రణలోనే ఉంచుని అటాకింగ్‌కు దిగినా జర్మనీకి ఎలాంటి ఫలితం అందలేదు. జర్మనీ ఆటగాళ్ల దూకుడుకు స్వీడన్ ఆటగాళ్లు ఎక్కడికక్కడ బ్రేకులు వేశారు. మ్యాచ్ ముగిసే సమయానికి జర్మనీ- స్వీడన్ 1-1తో ఉన్నాయి. ఈ భయానక పరిస్థితికి ఇంజ్యూరీ టైంలో క్రూస్ పరిష్కారం చూపించాడు. 95వ నిమిషంలో ర్యూస్ పాస్ చేసిన బంతిని కార్మర్ నుంచి ప్రీకిక్‌తో గోల్ చేసి జర్మనీకి ఊపిరిపోశాడు.