క్రీడాభూమి

పోవాలనే కోరుకున్నారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోచి, జూన్ 24: ‘జర్మనీ నిష్క్రమణను బలంగా కోరుకుంటున్న వారికి నేనిచ్చిన సమాధానమిది’ అంటూ టోని క్రూస్ వ్యాఖ్యానించాడు. స్వీడన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన అనంతరం ఏఆర్డీ బ్రాడ్‌కాస్టర్ వద్ద తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ మాజీ ఆటగాళ్లు, ఫుట్‌బాల్ పండితులు చాలామందే జర్మనీ నిష్క్రమణను బలంగా కోరుకున్నారు.
దురదృష్టవశాత్తూ వాళ్ల కోరిక ఫలించలేదు అంటూ టోనీ క్రూస్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఫస్ట్ఫాలో మెక్సికోతో జరిగిన మ్యాచ్‌లో జర్మనీ ఆటతీరుపై తీవ్ర విమర్శలు, అసంతృప్తులు చెలరేగటం తెలిసిందే. కోచ్ జోచిన్ ల్యూస్ జట్టు గ్రూప్ మ్యాచ్‌ల నుంచే ఇంటికెళ్లిపోవడం ఖాయమంటూ విమర్శలు గుప్పించారు.
స్వీడన్‌పై విజయం తరువాత దీనిపై టోనీ క్రూస్ తీవ్రంగా స్పందించాడు. ‘మేం ఇంటికెళ్లిపోయే పరిస్థితి వచ్చివుంటే చాలామందే సంతోషించేవారు. మా మొదటి మ్యాచ్ తరువాత చాలామంది ఫుట్‌బాల్ పండితులు కోరుకున్నదిదే’ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ‘నేను మాట్లాడేది జర్మనీకి మద్దతు పలుకుతూ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానుల గురించి కాదు’ అంటూ మరో చురక అంటించాడు.