క్రీడాభూమి

రికార్డుల మోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెప్టెన్ హ్యారీ కేన్ హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగిపోయాడు. ఫిఫా ప్రపంచకప్ టోర్నమెంట్ మొత్తంలో ఇప్పటి వరకూ అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. అంతేకాదు, 1986 ప్రపంచకప్ పోరులో హ్యాట్రిక్ గోల్స్ సాధించిన గ్యారీ లినేకర్ రికార్డును హ్యారీ కేన్ సమం చేశాడు.
*
1966లో ప్రపంచ కప్‌ను సొంతం చేసుకున్న ఇంగ్లాండ్, ఇప్పటి వరకూ సాధించిన అత్యధిక (నాలుగు) గోల్స్‌కంటే, పనామాపై సాధించిన గోల్స్ (ఆరు) ఎక్కువ. ఇలా ఇంగ్లాండ్ తన రికార్డును తానే తిరగరాసుకుంది. అంతేకాదు, ప్రపంచకప్ చరిత్రలోనే మ్యాచ్ ప్రథమార్థంలో ఐదు గోల్స్ సాధించడం ఇంగ్లాండ్‌కు ఇదే తొలిసారి. మరోపక్క 2010 తరువాత గ్రూప్ మ్యాచ్‌ల నుంచే విఫలమవుతున్న ఇంగ్లాండ్, ఈసారి నాకౌట్‌కు చేరుకోవడం కూడా రికార్డే.
*
ఇంగ్లాండ్‌తో ఆడిన మ్యాచ్‌లో ఓడిన పనామా నాకౌట్‌కు రాకుండానే ఇంటిముఖం పడితే, ఇదే గ్రూప్‌లోని టునీషియా సైతం ఇంటిదారి పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గ్రూప్-జిలోని ఈ రెండు జట్లూ ప్రపంచ కప్ నుంచి ఇక నిష్క్రమించినట్టే.