క్రీడాభూమి

అభిమాని మలిచె..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోచిమిన్ సిటీ, జూన్ 26: ప్రపంచవ్యాప్తంగా ఫిఫా వరల్డ్‌కప్ ఫీవర్ నడుస్తోంది. వివిధ దేశాల నుంచి మైదానంలోకి దిగిన ఆటగాళ్లు తమ ఆటలో కళాత్మక రీతిని ప్రదర్శిస్తుంటే.. మైదానం వెలుపలున్న అభిమానులు తమ సృజనాత్మక కళలో ఆటను ప్రదర్శిస్తున్నారు. అలా, సృజనాత్మక కళలో ఆరితేరిన 67ఏళ్ల న్గుయెన్ తన్హ్ టామ్ ప్రదర్శిస్తోన్న కళాత్మక ఆట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వియత్నాంకు చెందిన న్గుయెన్ ఓ రిటైర్డ్ స్కూల్ టీచర్. ఈయనకూ ఫుట్‌బాల్ పిచ్చివుంది. ఆ వెర్రి అభిమానంతోనే వరల్డ్ కప్ మస్కట్‌లు తయారు చేయడం మొదలెట్టాడు. అదీ, ప్రపంచకప్ ఆరంభానికి ముందునుంచే. ఆయన సృజనాత్మక కళాప్రదర్శనకు వినియోగిస్తున్న వస్తువులు కోడిగుడ్డు గుల్లలు. టోర్నమెంట్ మస్కట్ అయిన జబివకా (కళ్లజోడు పెట్టుకుని ఫుట్‌బాల్ కిక్ కొడుతున్న తోడేలు)ను వివిధ భంగిమల్లో తయారు చేసి ప్రదర్శిస్తుండటం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. అంతేకాదు, ఈయన తయారు చేసిన టీనీ టాయ్స్‌లో ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ హీరోలు క్రిస్టియానో రొనాల్డో, లయనెల్ మెస్సీలు కూడా దర్శనమిస్తున్నారు. ‘గత కొనే్నళ్లుగా కేవలం కోడిగుడ్డు గుల్లలతో వీటిని తయారు చేస్తున్నా. ఇవి సీజనల్‌గా తయారు చేస్తున్నవి కాదు. నా ఆత్మ సంతృప్తి. ఫుట్‌బాల్ క్రీడపట్ల నాకున్న అభిమానం’ అంటున్నాడు ఈ వృద్ధ అభిమాని. నిజానికి వియత్నాంలో ఈ కళకు పెద్దగా ఆదరణ లేదు. అయినా ఎందుకు తయారు చేస్తున్నానంటే ‘కోడిగుడ్డు డొల్లలకు షార్ప్‌నెస్ ఉంటుంది. వాటిని బొమ్మలుగా మలచాలంటే సృజనాత్మకత, పరిశీలన, సహనం, సమయం కావాలి. అందుకే ఈ కళ అంటే నాకు ఇష్టం’ అంటున్నాడు ఈ ఫుట్‌బాల్ వీరాభిమాని. ‘ఈ కళపట్ల 2002 క్రిస్టమస్ నుంచి ఆసక్తి కలిగింది.
అప్పట్లో ఓ విద్యార్థి కోడిగుడ్డు డోల్లతో శాంతక్లాజ్ బొమ్మను తయారు చేసి నాకు గిఫ్ట్‌గా ఇచ్చాడు. చాలా నచ్చింది. ఓ విద్యార్థి చేయగాలేనిది, అధ్యాపకుడిని నేను చేయలేనా? అనిపించింది. అలా సాధన మొదలెట్టాను. ఇదిగో ఇప్పుడు ఇలాంటి బొమ్మలు తయారు చేయగలుగుతున్నా’ అంటున్నాడు న్గుయెన్. ‘సహజంగానే నేను ఫుట్‌బాల్ అభిమానిని. దక్షిణ అమెరికాలో 2010లో సాకర్ జరిగినప్పటి నుంచీ ఫుట్‌బాల్ మస్కట్‌ల తయారీ మొదలెట్టాను. ఇదిగో ఈ ప్రపంచ కప్ నాటికి వెయ్యికి పైగా మస్కట్‌లు, ఆటగాళ్ల నమూనాలను తయారు చేశాను. ఇప్పుడు నా అపార్ట్‌మెంట్ ఓ మ్యూజియంలా వుంది’ అంటూ మురిసిపోతున్నాడు న్గుయెన్. ఇవొక్కటే కాదు, ఈయన దగ్గర 2016 రియో ఓలింపిక్స్ బొమ్మలు, యూరో 2016 ఫ్రాన్స్ బొమ్మలు, సెలబ్రిటీలైన చార్లీ చాప్లిన్, బరాక్ ఒబామా, గన్‌గమ్ స్టయిల్ ప్సై.. ఇలా ఎన్నో కలెక్షన్స్ ఉన్నాయి. ‘నిజానికి ఈ కళ అంత సులువేమీ కాదు. మనం తీర్చిదిద్దాల్సిన ఆకారాన్ని మనసులో ముద్రించుకుని, అందుకు తగిన గుడ్డు డొల్లను ఎంపిక చేసుకోడవమే పెద్ద టాస్క్. అలా తీసుకున్న డొల్లను ఓపికతో కళాత్మకంగా తీర్చిదిద్దడంలో ఎంతో సంతృప్తి, ఆనందం ఉంటుందని అంటున్నాడు న్గుయెన్. రష్యా వెళ్లాల్సిన అవసరం లేకుండానే, ఫిఫాను న్గుయెన్ ఇలా ఎంజాయ్ చేస్తున్నాడన్న మాట.