క్రీడాభూమి

అర్జున్ బౌలింగ్.. కోహ్లీ బ్యాటింగ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 26: టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్ర్తీని అర్జున్ టెండూల్కర్ ఇంగ్లాండ్‌లో కలుసుకున్నాడు. వచ్చే నెలలో భారత్-ఏ టీమ్ తరఫున శ్రీలంకలో నాలుగు రోజుల మ్యాచ్‌లు రెండు, ఐదు వనే్డ మ్యాచ్‌లు ఆడనున్న నేపథ్యంలో ఆటలో మరిన్ని మెళకువలు నేర్చుకోడానికి రవిశాస్ర్తీని కలిసినట్టు బీసీసీఐ వెల్లడించింది. అర్జున్ తన ఆట మరింత పదునుదేరేందుకు అవసరమైన కీలక విషయాలను రవిశాస్ర్తీ నుంచి తెలుకునేందుకు ఉత్సాహం చూపాడట. ఇక 18 ఏళ్ల ఎడమచేతివాటం ఫాస్ట్ బౌలర్ అర్జున్ పనిలో పనిగా ఇంగ్లాండ్ టూర్‌లోవున్న టీమిండియా క్రికెటర్లకు నెట్ ప్రాక్టీస్‌లో బౌలింగ్ చేశాడట. కెప్టెన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఈనెల 27, 29న ఐర్లాండ్‌తో రెండు టీ-20 మ్యాచ్‌లలో ఆడనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌లో నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్న విరాట్ కోహ్లీ సహా పలువురు క్రికెటర్లకు అర్జున్ కొంతసేపు బౌలింగ్ వేశాడు.