క్రీడాభూమి

ఫ్రాన్స్ టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో/ సోచి, జూన్ 26: ఫిఫా ప్రపంచకప్ గ్రూప్-సిలో ఫైనల్ మ్యాచ్‌లు ఆసక్తికరంగా ముగిశాయి.
గ్రూప్‌లో అగ్రస్థానం కోసం సెయంట్ పీటర్స్‌బర్గ్ మైదానంలో ఉత్కంఠ పోరుకు ఫ్రాన్స్- డెన్మార్క్‌లు తెరలేపాయ. పట్టుకోసం పరస్పరం చేసిన విశ్వప్రయత్నాలు ఫలించకపోవడంతో సున్నా గోల్స్‌తో మ్యాచ్ ముగించాయి.
ఈ ప్రపంచకప్‌లో ఒక్క గోల్ లేకుండా (0-0) మ్యాచ్ ముగియడం ఇదే తొలిసారి.
తుది 16 జట్లలో స్థానం దక్కే అవకాశాలు లేకున్నా అనివార్యంగా సోచిలోని ఫిష్ట్ మైదానంలో పెరూ- ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి.
పెరూ 2 గోల్స్‌తో ఆస్ట్రేలియాపై 2-0తో విజయం సాధించింది.
నాకౌట్‌కు స్థానం దక్కకపోవడంతో ప్రపంచ కప్‌నుంచి నిష్క్రమించాయి.
గ్రూప్ -సిలో ఏడు పాయింట్లతో అగ్రస్థానంలోవున్న ఫ్రాన్స్, గ్రూప్-డిలో ఇప్పటికే నాకౌట్‌కు చేరుకున్న క్రొయేషియాతో తలపడే అవకాశం ఉంది.
గ్రూప్-సిలో ఐదు పాయింట్లతో ద్వితీయస్థానంలోవున్న డెన్మార్క్‌తో గ్రూప్-డిలోని ఏ జట్టు తలపడుతుందన్నది మంగళవారం అర్థరాత్రి జరిగే నైజీరియా -అర్జెంటీనా మ్యాచ్ ఫలితాన్ని బట్టి తేలనుంది.

చిత్రం..ఆస్ట్రేలియాపై గోల్ కోసం ప్రయత్నిస్తున్న పెరూ ఆటగాడు ఆండర్సన్ శాంటమారియా