క్రీడాభూమి

తొలి టీ-20 మనదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డబ్లిన్, జూన్ 27: ఐర్లాండ్‌తో ప్రారంభమైన రెండు టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో భాగంగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో 76 పరుగులతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. అందుకు ధీటుగా ఐర్లాండ్ తొమ్మిది వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేసింది. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు, యుజ్వేంద్ర చాహల్ మూడు వికెట్లు చేజిక్కించుకున్నారు. ఐర్లాండ్ జట్టులో పీటర్ ఛేజ్ నాలుగు వికెట్లు సాధించాడు. ఆట ప్రారంభంలో అదరగొట్టేలా ఆడిన టీమిండియా ఆఖర్లో తేలిపోయింది. టీమిండియాలో ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ, స్టయిలిష్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ కలసి అద్భుత భాగస్వామ్యం (160) అందించారు. వీరిద్దరూ అర్ధ సెంచరీలు నమోదు చేశారు. రోహిత్ (97) సెంచరీ మిస్ అయ్యాడు. గత ఏడాది ఇండోర్‌లో శ్రీలంకతో జరిగిన టీ-20లో రోహిత్ శర్మ 118 పరుగులు చేశాడు. అయితే, ఇపుడు ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నా టీ-20లలో అత్యధిక సిక్సర్లు (83) చేసిన తొలి భారత క్రికెటర్ ఘనత రోహిత్‌కే దక్కుతుంది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 17 పరుగులు చేసి ఉంటే ఫాస్టెస్ట్‌గా రెండు వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు పుటల్లోకి ఎక్కేవాడు. కానీ ఈ మ్యాచ్‌లో కోహ్లీ పరుగుల ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. అయినా ఐర్లాండ్‌తో శుక్రవారం జరిగే మ్యాచ్‌లో లేదా ఆ తర్వాత జూలైలో ఇంగ్లాండ్ టూర్‌లో కోహ్లీ సరికొత్త రికార్డును నెలకొల్పే అవకాశం లేకపోలేదు. టాస్ గెలిచిన ఐర్లాండ్ ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ సిక్సర్లు, బౌండరీల వర్షం కురిపించి అభిమానులను అలరించారు. 15.6 ఓవర్‌లో 160 పరుగుల వద్ద ధావన్ కెవిన్ ఓ బ్రీన్ బౌలింగ్‌లో ఎస్.్థంప్సన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. ధావన్ 45 బంతులు ఎదుర్కొని ఐదు సిక్సర్లు, మరో ఐదు బౌండరీల సహాయంతో 74 పరుగులు చేశాడు.
తర్వాత సురేష్ రైనా ఆరు బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతో 10 పరుగులు చేసి ఛేజ్ బౌలింగ్‌లో కెవిన్ ఓ బ్రీన్‌కు క్యాచ్ ఇచ్చాడు. వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ ఐదు బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, మరో ఫోర్‌తో 11 పరుగులు చేసి ఛేజ్ బౌలింగ్‌లో ఎస్.్థంప్సన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. 61 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ ఐదు సిక్సర్లు, ఎనిమిది బౌండరీ సహాయంతో 97 పరుగులు చేసి బౌల్డ్ అయ్యాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే ఛేజ్ బౌలింగ్‌లో ఎస్.్థంప్సన్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఐర్లాండ్ బౌలర్లలో పీటర్ ఛేజ్ నాలుగు ఓవర్లలో 35 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. కెవిన్ ఓ బ్రీన్ మూడు ఓవర్లలో 36 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. అనంతరం ప్రత్యర్థి తమ ముందు ఉంచిన నిర్ణీత 209 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ మూడు బంతులు ఎదుర్కొని ఒక పరుగు మాత్రమే చేసి జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. ఆండ్రూ బాల్‌బిర్నీ 14 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌తో 11 పరుగులు చేసి యుజువేంద్ర చాహల్ బౌలింగ్‌లో ధోని చేతిలో స్టంపవుట్ అయ్యాడు.
జేమ్స్ షన్నన్ 35 బంతులు ఎదుర్కొని నాలుగు సిక్సర్లు, ఐదు బౌండరీల సహాయంతో 60 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ చేతిలో ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. తొమ్మిది బంతులు ఎదుర్కొన్న కెప్టెన్ గ్యారీ విల్సన్‌ను యుజువేంద్ర చాహల్ బౌలింగ్‌లో ధోనీ స్టంపవుట్ చేశాడు. కెవిన్ ఓ బ్రీన్ ఐదు బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్‌తో 10 పరుగులు చేసి యుజువేంద్ర చాహల్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ ముఖం పట్టాడు. 8 బంతులు ఎదుర్కొన్న స్టువర్ట్ థాంప్సన్ ఒక ఫోర్‌తో 12 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో హార్ధిక్ పాండ్యకు క్యాచ్ ఇచ్చాడు. వికెట్ కీపర్ సువర్ట్ పాయింటర్ తొమ్మిది బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్‌తో ఏడు పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ చేతిలో బౌల్డ్ అయ్యాడు.
ఆరు బంతులు ఎదుర్కొన్న జార్జ్ డాక్‌రెల్ ఒక సిక్సర్‌తో తొమ్మిది పరుగులు చేసి జస్ప్రీత్ బుమ్రా చేతిలో బౌల్డ్ అయ్యాడు. బాయిడ్ రామ్‌కిన్ 13 బంతులు ఎదుర్కొని ఐదు పరుగులు, పీటర్ ఛేజ్ ఎనిమిది బంతులు ఎదుర్కొని రెండు పరుగులతో బరిలో నిలిచారు.
టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు ఓవర్లలో 21 పరుగులిచ్చి నాలుగు వికెట్లు, యుజ్వేంద్ర చాహల్ నాలుగు ఓవర్లలో 38 పరుగులిచ్చి మూడు వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా నాలుగు ఓవర్లలో 17 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నారు.