క్రీడాభూమి

అర్జెంటీనా హ్యాపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెయింట్ పీటర్స్‌బర్గ్, జూన్ 27: ఫిఫా ప్రపంచకప్ గ్రూప్ ఫైనల్ మ్యాచ్‌లు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. సంచలనాలకు తెరలేపుతున్నాయి. ఫేవరేట్ జట్లను పసికూనలు ముప్పుతిప్పలు పెడుతుంటే, పెద్ద జట్లలో పిక్కలు పండిన ఆటగాళ్లు సైతం విలవిల్లాడుతున్నారు. గ్రూప్-డిలో అర్జెంటీనా అలాంటి పరిస్థితినే ఎదుర్కొని, కనాకష్టంగా నాకౌట్‌కు గట్టెక్కింది. నైజీరియాతో జరిగిన గ్రూప్ ఫైనల్ మ్యాచ్‌లో అతి కష్టంమీద 2-1 స్కోరు సాధించి తుది 16లో బెర్త్ పదిలం చేసుకుంది. గెలుపు అనివార్యంగా ఆట మొదలెట్టిన అర్జెంటీన్టా, సమష్టి కృషితో విజయం సాధించింది. 86వ నిమిషంలో అర్జెంటీనా సాధించిన రెండో గోల్‌తో స్టేడియంలో ఊపిరి బిగబెట్టి మ్యాచ్ చూస్తున్న అభిమానులు ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. అర్జెంటీనా మాజీ స్టార్ డిగో మారడోనా అయితే స్టాండ్స్‌లో నిలబడి రెండు చేతులు బారుగా చాపి ఆకాశాన్ని చూస్తూండిపోయాడు. తీవ్ర ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో నైజీరియన్ ఆటగాళ్లు సైతం శ్రమకోడ్చినా, అర్జెంటీనా సమష్టి కృషి ముందు నిలవలేకపోయారు. పదవ నెంబర్‌తో మైదానంలోకి దిగిన మెస్సీ, సరిగ్గా 14వ నిమిషంలో అత్యద్భుతమైన గోల్ సాధించడంతో అర్జెంటీనా 1-0తో ఆధిక్యానికి చేరింది. నైజీరియా డిఫెన్స్‌ను చేధించుకుంటూ బెనేగా పాస్‌ను అందుకుని, బలమైన షాట్‌తో మెస్సీ నెట్స్‌కు తరలించటంతో స్టేడియం ఒక్కసారిగా కేరింతలతో మార్మోగిపోయింది. మెస్సీ ఫేస్ మాస్క్‌ల, టెన్ నెంబర్ టీషర్ట్‌లతో అభిమానులు కేరింతలు కొట్టారు. అర్జెంటీనా సాధించిన గోల్‌తో నైజీరియా జట్టు తీవ్ర వత్తిడికి గురైంది. ప్రథమార్థం ముగిసే సమయానికి నైజీరియా గోల్ సాధించలేకపోయింది. ద్వితీయార్థంలో అద్భుత పోరాట పటిమ చూపించిన నైజీరియా, 51వ నిమిషంలో అందివచ్చిన పెనాల్టీతో గోల్ సాధించి స్కోర్‌ను సమం చేసింది. నైజీరియా మిడ్‌ఫీల్డర్ విక్టర్ మోజెస్ గోల్ సాధించటంతో అర్జెంటీనాపై మళ్లీ వత్తిడి పెరిగింది. నువ్వా నేనా అన్నట్టు సాగిన పోరులో 85వ నిమిషంలో అర్జెంటీనా గోల్ సాధించడంతో 2-1 ఆధిక్యానికి చేరుకుంది. మార్కోస్ రోజో అద్భుతమైన గోల్‌తో అర్జెంటీనాకు కొత్త ఊపిరి పోశాడు. మ్యాచ్ చివరి వరకూ అలుపెరుగని పోటీరం సలిపిన నైజీరియా, చివరకు అర్జెంటీనా ముందు తలవంచక తప్పలేదు. దీంతో 2-1తో అర్జెంటీనా విజయం సాధించి నాకౌట్‌కు బెర్త్ పదిలం చేసుకుంది.
అనివార్యమైన అర్జెంటీనా విజయానికి ఆరంభం మెస్సీ అయితే, ముగింపు రోజో ఇచ్చాడు.