క్రీడాభూమి

నెగ్గిన కంగారూలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రెడ (నెదర్లాండ్స్), జూన్ 27: అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న భారత హాకీ జట్టుకు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. ఎఫ్‌ఐహెచ్ చాంపియన్స్ ట్రోఫీ హాకీలో బుధవారం ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో అలుపెరుగని పోరు సలిపిన భారత్, చివరకు 2-3తో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. దాయాది దేశం పాకిస్తాన్, మాజీ ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా జట్లపై సాధించిన విజయాలతో మైదానంలోకి దిగినా, ప్రపంచ చాంపియన్‌ను ఎదుర్కొనే విషయంలో ఒకింత వత్తిడికి గురైంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు తన అద్భుత ప్రావీణ్యంతో భారత్‌పై విజయం సాధించింది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు లాచ్‌లాన్ షార్ప్ (6వ నిమిషం), టామ్ క్రెయిగ్ (15వ నిమిషం), ట్రెంట్ మిట్టన్ (33వ నిమిషం)లు అద్భుత గోల్స్ సాధించటంతో భారత్ ఒకడుగు వెనక్కివేయక తప్పలేదు. భారత ఆటగాళ్లు సైతం ఏమాత్రం తడబడకుండా దూకుడును ప్రదర్శించి గట్టి పోటీయే ఇచ్చారు. వరుణ్‌కుమార్ (10వ నిమిషం), హర్మన్‌ప్రీత్ సింగ్ (58వ నిమిషం)లు చెరో గోల్ అందించి భారత్‌ను గౌరవప్రదమైన హోదాలో నిలిపారు. ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి ప్రథమ స్థానంలో నిలిచిన భారత్, ఆస్ట్రేలియాపై ఓటమి కారణంగా ఆరు పాయింట్లతో తృతీయ స్థానానికి పడిపోయింది. తాజా విజయంతో ఆస్ట్రేలియా ఏడు పాయింట్లు సాధించి అగ్రస్థానానికి చేరుకుంటే, ఆతిథ్య దేశం నెదర్లాండ్స్ ఆరు పాయింట్లతో ద్వితీయస్థానంలో ఉంది. ఆరు జట్లు పాల్గొంటున్న చాంపియన్స్ ట్రోఫీలో రౌండ్ రాబిన్ స్టేజ్ తరువాత బరిలో నిలిచిన జట్లు వచ్చే ఆదివారం తుది పోరుకు తలపడనున్నాయి. నేడు భారత్, బెల్జియంతో తలపడనుంది.