క్రీడాభూమి

మనూభాకర్ మరో రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 27: టీనేజ్ సంచలనం, ప్రఖ్యాత షూటర్ మనూభాకర్ మరోసారి వరల్డ్ రికార్డు సృష్టించింది. జర్మనీలోని సుహ్ల్‌లో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో 16 ఏళ్ల మనూ మహిళల జూనియర్ విభాగంలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో 24 షాట్లతో 242.5 స్కోరుతో గోల్డ్ మెడల్ అందుకుంది. ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ నిర్వహించే ఈవెంట్లలో మనూభాకర్ వ్యక్తిగత హోదాలో గోల్డ్ మెడల్ సాధించడం ఇది మూడోసారి. మనూ ఇంతకుముందు కంబైన్డ్ పోటీలో తన సహచరులు మహిమా తుర్హీ అగర్వాల్, దేవాన్షి రాణాతో కలసి 1694 స్కోరుతో రజత పతకం అందుకుంది. పురుషుల జూనియర్ విభాగంలో 25 మీటర్ల రాపిడ్ ఎయిర్ పిస్టల్ విభాగంలో పాల్గొన్న అనీష్ భన్వాలా కాంస్య పతకం గెల్చుకున్నాడు. అనీష్ ఇటీవల జరిగిన గోల్డ్ కోస్ట్ కామనె్వల్త్ గేమ్స్‌లో చాంపియన్‌గా అవతరించాడు. ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లలో అతనికి ఇది నాలుగో మెడల్ కావడం గమనార్హం. కాగా, ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లోని వివిధ విభాగాల్లో భారత్‌కు ఇప్పటివరకు 17 మెడల్స్ దక్కాయి.

సింధు శుభారంభం
మలేషియా ఓపెన్ టోర్నమెంట్
కౌలాంలపూర్, జూన్ 27: ఒలింపిక్ రజత పతక విజేత, వరల్డ్ నెంబర్-3 పీవీ సింధు మలేషియా ఓపెన్ వరల్డ్ టూర్ టోర్నమెంట్‌లో శుభారంభం అందించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఆమె వరల్డ్ నెంబర్ 14, జపాన్‌కు చెందిన అయా ఓహోరీపై 26-24, 21-15తో విజయం సాధించింది. సింధు తన తదుపరి రౌండ్‌లలో మలేషియా క్రీడాకారిణి ఇంగ్ ఇంగ్ లీ, చైనా తైపీకి చెందిన చియాంగ్ ఇంగ్ లీతో తలపడుతుంది.