క్రీడాభూమి

ఘోర పరాభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కజన్, జూన్ 27: గ్రూప్-ఎఫ్ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణ కొరియాతో తలపడిన జర్మనీ ఒక్క గోల్ కూడా చేయలేక చిత్తుచిత్తుగా ఓడిపోయింది. దీంతో నాకౌట్‌కు చేరకుండానే నిష్క్రమించాల్సి వచ్చింది. తొలుత మెక్సికో చేతిలో దెబ్బతిన్న జర్మనీ, తరువాతి మ్యాచ్‌లో స్వీడన్‌ను మట్టికరిపించి అభిమానుల్లో ఆశలు రేకెత్తించింది. అయితే అనివార్యంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పేలవమైన ఆటతీరు ప్రదర్శించి పసికూన కొరియా జట్టుముందు జర్మనీ తలొంచింది. ఇదే గ్రూపులో మెక్సికోతో జరిగిన మ్యాచ్‌లో స్వీడన్ 3-0తో విజయం సాధించింది. దీంతో పాయింట్ల జాబితాలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన స్వీడన్, మెక్సికోలు నాకౌట్‌కు చేరుకున్నాయి. ఓడిన జర్మనీ, ఓడించిన దక్షిణ కొరియాలు మాత్రం ప్రపంచకప్ నుంచి నిష్క్రమించక తప్పలేదు. తొలుత నువ్వా నేనా అన్నరీతిలో సాగిన మ్యాచ్, జర్మనీ ఒక్క గోల్ కూడా సాధించకపోవడంతో అభిమానుల్లో నీరసం ఆవహించింది. కొరియన్ గోల్ పోస్టులపై జర్మనీ పెద్దఎత్తునే దాడి చేసినా ఫలితం దక్కలేదు. అదే సమయంలో స్టాపేజ్ టైంలో భాగంగా (90+2)వ నిమిషంలో వార్ నుంచి అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కొరియా డిఫెండర్ కిమ్ యోంగ్ గ్వోన్ గోల్ సాధించిన 1-0 ఆధిక్యం సాధించాడు. కొరియాకు (90+6)వ నిమిషంలో మరో అవకాశం చిక్కడంతో సన్ హ్యూంగ్ మిన్ అద్భుతమైన గోల్ సాధించి దక్షిణ కొరియాను 2-0కి చేర్చాడు. అయతే, ఓడిన జర్మనీ, ఓడించిన దక్షిణ కొరియా జట్టు సైతం పాయంట్ల లెక్కల ప్రకారం నిష్క్రమించక తప్పలేదు.