క్రీడాభూమి

శ్రీకాంత్, సింధు విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌలాలంపూర్, జూన్ 28: మలేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 750 టోర్నమెంట్‌లో భారత షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ గురువారం జరిగిన స్ట్రయిట్ గేమ్స్ గెలుపుతో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. ఒలింపిక్ పతక విజేత సింధు మహిళల సింగిల్స్‌లో తన ప్రత్యర్థి, మలేషియాకు చెందిన ఇంగ్ ఇంగ్ లీని 21-8, 21-14 తేడాతో ఓడించింది. సింధు తన తదుపరి మ్యాచ్‌లో ఒలింపిక్ చాంపియన్, మాజీ వరల్డ్ నెంబర్ వన్ కరొలినా మారిన్‌తో తలపడుతుంది. ఇక పురుషుల సింగిల్స్‌లో నాలుగో సీడ్ కిడాంబి శ్రీకాంత్ చైనీస్ తైపీ ఆటగాడు వాంగ్ జు ఉయ్‌ని 22-20, 21-12తో 36 నిమిషాల్లో ఓడించాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో వరల్డ్ నెంబర్ వన్‌గా అవతరించిన శ్రీకాంత్ శుక్రవారం ఫ్రాన్స్‌కు చెందిన బ్రీస్ లెవెర్డెజ్‌తో తలపడతాడు. మరోపక్క మరో భారత షట్లర్ సైనా నెహ్వాల్ స్ట్రయిట్ గేమ్‌లో జపాన్‌కు చెందిన అకనే యమగూచితో తలపడి పరాజయం పాలైంది. కామనె్వల్త్ గేమ్స్‌లో రెండుసార్లు గోల్డ్ మెడల్స్ అందుకున్న సైనా నెహ్వాల్ 15-21, 13-21తో యమగూచిపై ఓడిపోయింది.