క్రీడాభూమి

ఐర్లాండ్ పర్యటనతో ఆనందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలహైడ్ (ఐర్లాండ్), జూన్ 28: ఐర్లాండ్ పర్యటనను విజయవంతంగా ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని టీమిండియా బౌలర్ కుల్దీప్ యాదవ్ తెలిపాడు. తనకు స్వదేశ టూర్‌లో ఆడిన అనుభూతిని ఇచ్చిందని చెప్పాడు. ఐర్లాండ్‌తో జరిగిన టీ-20 తొలి మ్యాచ్ విజయంలో కుల్దీప్‌యాదవ్ కీలక పాత్ర వహించాడు. నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. తను బౌలింగ్‌లో రాణించేందుకు సహచర బౌలర్ యుజువేంద్ర చాహల్ తోడయ్యాడని, మ్యాచ్ కొనసాగుతున్నపుడు మధ్యలో పిచ్ పరిస్థితిని తనకు వివరించడంతో బౌలింగ్‌లో వైవిధ్య భరితమైన బంతులు వేసి వికెట్లు తీయగలిగానని పేర్కొన్నాడు. యూకే మొదటి పర్యటనలో భాగంగా తొలి మ్యాచ్‌లో రాణించడం తన సంతోషం రెట్టింపైందని చెప్పాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు చాహల్‌తో బౌలింగ్ ఎలా వేయాలన్న విషయంపై చర్చించానని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో తనకంటే ముందు బౌలింగ్ వేసిన చాహల్ పిచ్ గురించి తెలపడంతో తన బౌలింగ్ సరళిని మార్చుకోవడంతో ఆశించిన ఫలితం సాధించాగలిగానని వివరించాడు. తన బౌలింగ్‌ను ఐర్లాండ్ బ్యాట్స్‌మెన్‌లు ఎదురుకోలేకపోయారన్నాడు. ఐర్లాండ్‌లో జరిగిన టీ-20 తొలి మ్యాచ్‌లో టీమిండియా 76 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.