క్రీడాభూమి

టీ-20లో భారీ ప్రయోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలహైడ్ (ఐర్లాండ్), జూన్ 28: అంతర్జాతీయ ఫార్మాట్‌లో జరుగుతున్న టీ-20లో ప్రత్యర్జి జట్టును అశ్చర్యానికి గురిచేసే విధంగా పెద్ద ఎత్తున ప్రయోగాలు చేస్తున్నామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఐర్లాండ్‌తో జరుగనున్న రెండు టీ-20 మ్యాచ్‌లతో పాటు ఇంగ్లాండ్‌తో జరుగనున్న టీ-20 సిరీస్‌లో టీమిండియా బ్యాటింగ్ మిడిలార్డర్‌లో భారీ ప్రయోగాలు చేయనున్నట్లు తెలిపాడు. దీంతో జట్టులో ప్రతిఒక్కరు ఏదో మ్యాచ్‌లో భ్యాటింగ్ ఆవకాశం తప్పకుండా లభిస్తుందన్నాడు. ఐర్లాండ్‌లో జరిగిన టీ-20 మ్యాచ్‌లో అవకాశం రాని ఆటగాళ్లు, మిగతా మ్యాచ్‌లు ఆడటానికి సిద్ధంగా ఉండాలని సూచించాడు. ఇంగ్లాండ్‌తో ఆడే ఓపెనింగ్ కాంబినేషన్‌ను ఇప్పటికే ప్రకటించామని, అయితే మిడిలార్డర్‌లో మాత్రం ఎన్నడూ లేనివిధంగా భారీగా మార్పులు చోటు చేసుకోవడం ఖాయమని కెప్టెన్ స్పష్టం చేశాడు. పరిస్థితిని బట్టి తుది జట్టులో మార్పులు చోటుచేసుకుంటాయని పేర్కొన్నాడు. జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులతో ప్రత్యర్థి జట్టును ఆశ్చర్యానికి గురిచేస్తామన్నాడు. ఒక మ్యాచ్‌లో ఎవరికైతే చాన్స్ రాలేదో అలాంటి వారికి తర్వాతి మ్యాచ్‌లో కచ్చితంగా ఆవకాశం కల్పించనున్నట్తు పేర్కొన్నాడు. ఈ నిర్ణయం పట్ల జట్టు సభ్యులంతా సంతోషం వ్యక్తం చేశారని, ఆటగాళ్లు ఆవకాశం వచ్చేవరకు ఓపిక పట్టాలని కోహ్లీ సూచించాడు. ఐర్లాండ్‌తో జరిగిన మొదటి టీ-20 మ్యాచ్‌లో టీమిండియా 76 పరుగుల తేడాతో విజయం సాధించిందన్నాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌లు చక్కటి ఆటతీరును ప్రదర్శించారని, ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ధోనీ, రైనా, పాండ్య దూకుడుగా ఆడారన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులుంటాయని గతంలోనే చెప్పానని, టీ-20లో ఓపెనర్లు మినహా మిగతా ఆటగాళ్ల బ్యాటింగ్‌లో మార్పులుంటాయన్నాడు. టీ-20 మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి ఆటగాళ్లను తికమకపెట్టడమే మార్పులో ప్రధాన అంశమని స్పష్టం చేశాడు. ఇక బౌలర్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్నాడు. శుక్రవారం ఐర్లాండ్‌తో జరుగనున్న టీ-20 రెండో మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో ఆవకాశం దొరకని వారికి ప్రధాన్యతనిస్తామన్నాడు.