క్రీడాభూమి

సారీ...క్షమించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రాంక్‌ఫర్ట్ అమ్ మెయిన్, జూన్ 28: ఫిఫా వరల్డ్ కప్‌లో దక్షిణ కొరియా చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొన్న డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ గురువారం స్వదేశానికి తిరిగి వచ్చింది. ఈ సందర్భంగా ‘సారీ..మీ అందరి అంచనాలను అందుకోలేకపోయాం..అన్నింటా విఫలమయ్యాం..క్షమించండి’ అంటూ జట్టు తన అధికారిక ట్విటర్ అకౌంట్‌లో దేశ ప్రజలు, అభిమానులను కోరింది. రష్యాలో జరుగుతున్న ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో 2-0తో ఘోరంగా ఓడిపోయిన షాక్ నుంచి జర్మనీ ఆటగాళ్లు ఇంకా కోలుకోలేదు. ‘ప్రియమైన అభిమానులారా..మిమ్ములను అసంతృప్తికి గురిచేశాం..ఇందుకు క్షమాపణ కోరుతున్నాం..ఒక ప్రపంచ చాంపియన్‌గా ఆడలేకపోయాం..లీగ్ దశలోనే బయటకు వచ్చాం’ అంటూ జట్టులోని డిఫెండర్ మాట్స్ హుమెల్స్ ట్విటర్ వేదికగా వ్యాఖ్యానించాడు.