క్రీడాభూమి

నాకౌట్‌కు స్విట్జర్లాండ్, బ్రెజిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజ్‌హ్నీ నొవ్‌గోరాడ్ (రష్యా)/మాస్కో, జూన్ 28: రష్యాలో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో లీగ్ దశలో పోరు దాదాపు ముగుస్తున్న నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి గ్రూప్-ఈలో స్విట్జరాండ్, కోస్టారికా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు సమానంగా రెండేసి గోల్స్ చేయడంతో మ్యాచ్ డ్రా అయింది. మరోవైపు ఇదే గ్రూప్‌లో సెర్బియా, బ్రెజిల్ మధ్య జరిగిన మరో మ్యాచ్‌లో బ్రెజిల్ రెండు గోల్స్ చేయడంతో విజయవంతంగా నాకౌట్‌లోకి అడుగుపెట్టింది. ప్రస్తుత వరల్డ్ కప్‌లో మూడు మ్యాచ్‌లలో ఆడిన స్విట్జరాండ్ ఒక మ్యాచ్‌లో గెలిచింది. మరో రెండు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. అయినా స్విట్జరాండ్ ఐదు పాయింట్లతో నాకౌట్‌కు చేరుకుంది. కోస్టారికా గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ పరాజయాన్ని చవిచూసింది. బ్రెజిల్ ఏడు పాయింట్లతో ఈ గ్రూప్‌లో అగ్రస్థానాన్ని అందుకుని నాకౌట్ దశకు చేరుకుంది.
స్విట్జరాండ్-కోస్టారికా మధ్య జరిగిన మ్యాచ్ ఆద్యంతం హోరాహోరీగా జరిగింది. ఈ మ్యాచ్‌లో స్విట్జరాండ్ 13సార్లు దాడులకు తెగబడగా, ఆడగా, కోస్టారికా 14 సార్లు ప్రత్యర్థిపై దాడులు చేసింది. స్విట్జరాండ్ బంతిని 63 శాతం తమ స్వాధీనంలో ఉంచుకోవాలని ఎంతగానో ప్రయత్నించగా, కోస్టారికా 37 శాతం వరకు బంతిని తమ స్వాధీనంలో ఉంచుకుంది. ఆట ప్రారంభమైన అరగంట వరకూ ఇరు జట్లు ఎలాంటి గోల్స్ చేయలేకపోయాయి. ఆట 31వ నిమిషంలో స్విట్జరాండ్ ఆటగాడు బ్లెరిమ్ జమేలి తొలి గోల్ చేసి జట్టుకు శుభారంభం అందించాడు. ప్రత్యర్థి జట్టు సైతం తొలి గోల్ కోసం విశ్వప్రయత్నం చేసినప్పటికీ చాలాసేపటివరకు ఎలాంటి ఫలితం దక్కలేదు. ఆట 56వ నిమిషంలో కోస్టారికా ఆటగాడు కెండియల్ వాస్టన్ తొలి గోల్ చేసి ఇరు జట్ల స్కోరును సమం చేశాడు. దీంతో రెండు జట్లు తదుపరి గోల్ కోసం హోరాహోరీగా తలపడ్డాయి. దాదాపు 30 నిమిషాలపాటు గోల్ చేయలేకపోయాయి. ఆట 88వ నిమిషంలో స్విట్జరాండ్ ఆటగాడు జోసిప్ డ్రామిక్ రెండో గోల్ చేసి ప్రత్యర్థి టీమ్‌పై ఒత్తిడి పెంచాడు. ఇక మ్యాచ్ ముగుస్తున్న తరుణంలో కోస్టారికా జట్టు తీవ్ర ఒత్తిడి గురైంది. ఈ నేపథ్యంలో ఈ జట్టు ఆటగాడు యాన్ సోమ్మార్ 90+3 నిమిషంలో గోల్ చేయడంతో ఇరు జట్లకు సమానంగా రెండేసి వంతున పాయింట్లు వచ్చాయి. మరో గోల్ చేయడానికి సమయం లేకపోవడంతో స్విట్జరాండ్-కోస్టారికా మ్యాచ్ డ్రాగా ముగిసింది. కాగా, స్విట్జరాండ్ 1994, 2006, 2014 ప్రపంచ కప్‌లతోపాటు ప్రస్తుత (2018) వరల్డ్ చాంపియన్‌షిప్‌లో గ్రూప్ స్టేజిలు దాటి నాకౌట్‌కు చేరుకుంది. అయితే, 2010 టోర్నమెంట్‌లో మాత్రం గ్రూప్ స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది. మరోపక్క కోస్టారికా ఇంతవరకు రెండు వరల్డ్ కప్ టోర్నమెంట్లలో పాల్గొనగా ఎందులోనూ గ్రూప్ దశలోనే విఫలమైంది.
ఇక గ్రూప్-ఈలో రెండో మ్యాచ్‌లో సెర్బియా-బ్రెజిల్ మధ్య భీకరంగా పోరు జరిగింది. అయినా మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించిన బ్రెజిల్‌కే విజయలక్ష్మి వరించింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు కూడా ఎవరికి వారు గోల్స్ కోసం పరితపించారు. బ్రెజిల్ 59 శాతం, సెర్బియా 41 శాతం బంతిని తమ స్వాధీనంలో ఉంచుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాయి. ఇందులో భాగంగా ఇరు జట్టు గోల్ పోస్టులపై దాడులకు తెగబడ్డాయి. బ్రెజిల్ 14సార్లు, సెర్బియా 10సార్లు గోల్‌పోస్టులపై దాడులకు దిగాయి. ఆట ప్రారంభమైన అరగంట వరకూ ఇరు జట్లు ఒక్క గోల్‌ను కూడా చేయలేకపోయాయి. 36వ నిమిషంలో బ్రెజిల్ ఆటగాడు పౌలిన్‌హో తొలి గోల్ చేసి జట్టుకు శుభారంభం అందించాడు. దీంతో ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెరిగింది. తొలి గోల్ కోసం సెర్బియా, రెండో గోల్ కోసం బ్రెజిల్ హోరాహోరీగా తలపడ్డాయి. ఆ తర్వాత మరో అరగంట వరకూ ఇరు జట్లు గోల్‌ను నమోదు చేయలేకపోయాయి. అయితే, ఆట 68వ నిమిషంలో బ్రెజిల్‌కు చెందిన మరో ఆటగాడు తియాగో సిల్వ రెండో గోల్ చేసి జట్టు ఆధిక్యాన్ని పెంచాడు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి జట్టుపై మరింత ఒత్తిడి పెరిగింది. మ్యాచ్ ముగియడానికి ఇంకా మరో 20 నిమిషాలు ఉండడంతో కనీసం ఒక్క గోల్, లేదా రెండు గోల్స్ చేయడం ద్వారా మ్యాచ్‌ను డ్రాగా ముగించాలని సెర్బియా విశ్వప్రయత్నాలు చేసింది. అయినా వారి ప్రయత్నం ఫలించలేదు. చివరకు ఆట ముగిసే సమయం వరకూ ఇరు జట్ల ఖాతాలో మరో గోల్ నమోదు కాకపోవడంతో చివరకు బ్రెజిల్ 2-0తో సెర్బియా ఘన విజయం నమోదు చేసుకుంది. ఇక 1970 నుంచి ఫుట్‌బాల్ ఆడుతున్న బ్రెజిల్ ఇంతవరకు ఆడిన అన్ని వరల్డ్ కప్ మ్యాచ్‌లలోనూ 13సార్లు గ్రూప్ దశలు దాటి నాకౌట్‌కు చేరుకుంది. సెర్బియా 2006, 2010, 2018 ప్రపంచ కప్‌లలో ప్రాతినిధ్యం వహించి అన్ని మ్యాచ్‌లలోనూ గ్రూప్ దశలోనే తిరుగుముఖం పట్టింది.

చిత్రాలు.. గోల్‌తో స్విట్జర్లాండ్‌కు విజయాన్ని అందించిన ఆటగాడు (కుడి) బ్లెరిమ్ జమైలీ
*కీలకమైన మ్యాచ్‌లో సెర్బియాను గోల్ చేయకుండా అడ్డుకున్న గోల్‌కీపర్ అలిసన్‌ను అభినందిస్తున్న బ్రెజిల్ స్టార్ ఆటగాడు నేమార్