క్రీడాభూమి

డిఫెండింగ్ చాంపియన్ ఓటమిపై పరిహాసాలు, విమర్శలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, జూన్ 28: రష్యాలో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భాగంగా దక్షిణ కొరియాతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ చిత్తుగా ఓడిపోయినందుకు ఇంటర్నెట్ వేదికగా పరిహాసాలు, చలోక్తులు, విమర్శలు, జోక్స్ వెల్లువెత్తుతున్నాయి. ఈ మ్యాచ్‌లో జర్మనీ ఒక గోల్ కూడా చేయకుండా 2-0తో ఘోరంగా అవమానం పాలైంది. మ్యాచ్ ఆరంభం నుంచి బంతిని పూర్తిగా తమ ఆధీనంలోనే ఉంచుకున్నా మ్యాచ్ ముగిసేవరకు కనీసం ఒక్క గోల్ కూడా జర్మనీ చేయలేక చతికిలపడింది. ఇంజ్యూరీ టైమ్‌లో దక్షిణ కొరియా చెలరేగి రెండు గోల్స్ చేసి జర్మనీని తొలిసారిగా చిత్తుగా ఓడించారు. దక్షిణ కొరియా గత రెండు మ్యాచ్‌లలో మెక్సికో, స్వీడన్‌తో పోటీపడి ఓడిపోయింది. ఇపుడు జర్మనీపై గెలిచినంత మాత్రాన కొరియాకు వచ్చిన ప్రయోజనమేమే లేకపోయినా డిఫెండింగ్ చాంపియన్‌ను మట్టి కరిపించి లీగ్ దశలోనే తిరుగు టపా చేసినందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు, అభినందనలు వస్తున్నాయి. ప్రపంచ చాంపియన్‌లమని విర్రవీగుతున్న రష్యా ఆటగాళ్ల ఆటతీరు చిన్నపిల్లల తీరుగా ఉందని కొందరు జర్మనీ అభిమానులు వ్యాఖ్యానించారు. 80 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నడూ లీగ్ దశలో ఓటమిని చవిచూడని అగ్రదేశం ఇన్నాళ్లకు బోల్తాపడిందని మరికొందరు విమర్శించారు. ఈ సీజన్‌లో తొలిసారిగా ‘వార్’ను ప్రవేశపెట్టడంతో వారికి (జర్మనీ) అది కలసి రాలేదేమోనని మరికొందరు వ్యాఖ్యానించారు. 2014 ప్రపంచ కప్‌లో బ్రెజిల్‌ను 7-1తో జర్మనీ ఓడించడంతో అందుకు ఇపుడు బ్రెజిల్ పరోక్షంగా ప్రతీకారం తీర్చుకుందని మరికొందరు పేర్కొన్నారు. 1943 తర్వాత జరిగిన ప్రపంచ కప్‌లో తొలిసారిగా ప్రస్తుత సీజన్‌లోనే డిఫెండింగ్ చాంపియన్ త్వరితగతిన లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టినందుకు మరికొంతమంది సంబరం చేసుకున్నామన్నారు. ‘ఖాళీగా ఉన్న విమానంలోని సీట్లన్నీ జర్మనీ టవల్స్‌తో నింపండి’ అంటూ మరొకరు టీట్ చేశాడు.
ఇదిలావుండగా దక్షిణ కొరియా చేతిలో జర్మనీ చిత్తుగా ఓడిపోవడంతో అందరికంటే మెక్సికన్లు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గడిచిన మ్యాచ్‌లో అదృష్టవశాత్తూ డిఫెండింగ్ చాంపియన్ గెలిచి ఉంటే తమ దేశ జట్టు (మెక్సికో) ఇంటిదారి పట్టేదని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ తమ అదృష్టమో, జర్మనీ దురదృష్టమో..మ్యాచ్‌లో జర్మనీ ఓడిపోవడంతో కొరియా ఆటగాళ్లపై మెక్సికన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పాయింట్ల పట్టికలో జర్మనీ కంటే మెక్సికో ముందుంది. లీగ్ దశలోనే జర్మనీకి పరాభవంతో ఇంటిముఖం పట్టడంతో మెక్సికన్ల ఆనందానికి అవధులు లేవు. కొందరు మెక్సికన్లు ఇంకొంచెం ముందుకు వెళ్లి డిఫెండింగ్ చాంపియన్‌ను ఓడించిన దక్షిణ కొరియా ఆటగాళ్లకు ఎయిరోమెక్సికో విమానంలో 20 శాతం డిస్కౌంట్ ఇవ్వాలంటూ ట్వీట్ చేశారు. ‘ఉయ్ లవ్ కొరియా’ అంటూ సాక్షాత్తూ ఒక జర్మనీ అభిమానే వ్యాఖ్యానించాడు. ‘22 మంది ఫుట్‌బాల్ ఆటగాళ్లు..90 నిమిషాల వ్యవధి..కానీ...జర్మనీనే గెలిచింది..వాళ్లే ఎప్పుడూ గెలుస్తారు..్ఫట్‌బాల్ ఈజ్ సింపుల్ గేమ్’ అంటూ డిఫెండింగ్ చాంపియన్ ఆటతీరును పరిహాసం చేస్తూ మరో ట్వీట్ చేశాడు.
దక్షిణ కొరియా నాకౌట్‌కు చేరకున్నా, తుది 16 జట్లలో చోటు దక్కించుకోకున్నా ప్రపంచ నెంబర్ వన్‌ను చాప చుట్టేలా చేశామని, ఇది వారికి (జర్మనీ) గౌరవప్రదమైన వీడ్కోలు’ అంటూ దక్షిణ కొరియా ప్రధానమంత్రి లీ నాక్ ఇయోన్ వ్యాఖ్యానించాడు. ‘అంచనాలు, ఊహాలోకాల్లో ఉన్నవారికి అసలు సిసలైన దమ్ముతో ఓటమి అంటే ఏమిటో చూపించాం’ అంటూ పలువురు కొరియా ఫుట్‌బాల్ ఆటగాళ్లు పేర్కొన్నారు. సాకర్ అనే యుద్ధంలో దక్షిణ కొరియా దక్షిణ కొరియా మిలటరీ తరహా దాడులతో ఓడించిందంటే వారి సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసిందని మరొకరు వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో జట్టును మరింత పటిష్టంగా నిర్మిస్తామని, అన్ని విభాగాల్లో బాగా పరిణితి చెందుతామని కొరియా ఫుట్‌బాల్ ఆటగాడు ఒకరు గట్టి నమ్మకంతో చెప్పాడు.