క్రీడాభూమి

సెనెగల్‌పై కొలంబియా, జపాన్‌పై పోలాండ్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమర (రష్యా): ఫిఫా ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో గ్రూప్-హెచ్‌లో గురువారం ముగిసింది. సంచలనాల సెనెగల్‌పై కొలంబియా 1-0తో గెలుపొందగా, మరో మ్యాచ్‌లో జపాన్‌పై పోలాండ్ 1-0తో విజయం సాధించింది. ఈ రెండు జట్లు తమ తదుపరి మ్యాచ్‌లలో ఇంగ్లాండ్ లేదా బెల్జియంతో తలపడతాయి.
సెనెగల్-కొలంబియా మధ్య ప్రారంభమైన ఆట ప్రథమార్థం నుంచే ఇరు జట్లు పరస్పరం దాడులకు పాల్పడ్డాయి. బంతిని ఎక్కువసేపు తమ ఆధీనంలో ఉంచుకోవడానికే ఇరు జట్లు ప్రాధాన్యమిచ్చాయి. కొలంబియా ఒక అడుగు ముందుకేసి ప్రత్యర్థికి అన్ని విభాగాల్లోనూ గట్టి పోటీ ఇచ్చింది. అందుకు ధీటుగా సెనెగల్ కూడా స్పందించినా ఫలితం కన్పించలేదు. ఆట ప్రారంభమైన తొలి అర్ధ్భాగం వరకు ఇరు జట్లు ఒక్క గోల్‌ను కూడా నమోదు చేయలేకపోయాయి. ఇక మిగిలిన అర్ధ్భాగం మిగిలి ఉండడంతో రెండు జట్లు కూడా గోల్స్ కోసం తీవ్రంగా శ్రమించాయి. 74వ నిమిషంలో కొలంబియా ఆటగాడు మీనా హెడెర్ తొలి గోల్ చేసి జట్టు ఆధిక్యం ఇచ్చాడు. దీంతో ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెరిగింది. కనీసం ఒక్క గోల్ అయినా చేయాలని తపన పడిన సెనెగల్ ఆ తర్వాత ఆట ముగిసేవరకు గోల్ చేయలేక చేతులెత్తేసింది. చివరకు 1-0 ఆధిక్యంతో కొలంబియా విజయం సాధించడం ద్వారా నాకౌట్‌లో చోటు దక్కించుకుంది. సంచనాల సెనెగల్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. కొలంబియా హెచ్ గ్రూప్‌లో ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, సెనెగల్ కేవలం నాలుగు పాయింట్ల పరిమితమైంది. కొలంబియా 1990, 2014 తర్వాత ప్రస్తుత రష్యా వరల్డ్ కప్‌లో మూడోసారి గ్రూప్ స్టేజీలను దాటింది. సెనెగల్ ఇంతవరకు ఆడిన ఏడు ప్రపంచకప్ టోర్నమెంట్లలో దాదాపు అన్నింట్లోనూ సంతృప్తికరంగా రాణించలేకపోయింది. కానీ రష్యా వరల్డ్ కప్‌లో మాత్రం ఆడిన తొలి మ్యాచ్‌లో 1-0తో ఫ్రాన్స్‌పై గెలుపొంది సంచనాలకు తెరలేపింది.
మరోపక్క జపాన్-పోలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పోలాండ్ 1-0 తేడాతో గెలుపొందింది. ఆట ప్రారంభమైన దాదాపు గంట వరకు ఇరుజట్లు ఎలాంటి గోల్స్ చేయలేకపోయాయి. ఆట 59వ నిమిషంలో పోలాండ్ స్ట్రయికర్ జాన్ బెడ్నాక్ గోల్ చేసి జట్టుకు ఆధిక్యం అందించాడు. దీంతో ప్రత్యర్థి జట్టుపై తీవ్ర ఒత్తిడి మొదలైంది. తొలి గోల్ కోసం జపాన్, రెండో గోల్ చేయడం ద్వారా ప్రత్యర్థిపై మరింత ఒత్తిడి పెంచాలని పోలాండ్ హోరాహోరీగా తలపడ్డాయి. అయినా ఆట ముగిసేవరకు ఇరు జట్లు కూడా గోల్స్ నమోదు చేయకపోవడంతో చివరకు 1-0తో పోలాండ్ విజయం సాధించింది. అయితే, ఈ ఫలితంతో సంబంధం లేకుండా జపాన్ నాలుగు పాయింట్లు సాధించడంతో నాకౌట్‌పై ఆశలు నిలుపుకుంది. పోలాండ్ 1996 ప్రపంచ కప్‌లో 5-0తో, 2002లో 2-0తో జపాన్‌పై ఓటమిపాలైన తర్వాత మళ్లీ ప్రస్తుత ఫిఫా వరల్డ్ కప్‌లోనే అదే జట్టుపై గెలుపొందింది. జపాన్ సైతం ఆరు టోర్నమెంట్లలో పాల్గొన్నా ఐదింట్లో స్కోరు చేయలేకపోయింది. కేవలం 2010లో 2-1తో డెన్మార్క్‌పై విజయం సాధించింది.

చిత్రాలు..జపాన్‌పై తొలి గోల్ చేసిన ఆనందంలో పోలాండ్ ఆటగాడు జాన్ బెడ్నారెక్
*సెనెగల్‌పై గోల్ చేసిన ఎర్రీ మీనాను అభినందిస్తున్న కొలంబియా ఆటగాళ్లు