క్రీడాభూమి

సెమీస్‌కు సింధు, శ్రీకాంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌలాలంపూర్, జూన్ 29: మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పోరులో భారత షట్లర్‌లు కిదాంబి శ్రీకాంత్, పీవీ సింధు ప్రతిభావంతమైన ఆటతీరు కోనసాగిస్తున్నారు. మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ 750 టోర్నీ పురుషుల సింగిల్స్‌లో కిదాంబి సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 21-18, 21-14 స్కోరుతో వరల్డ్ 22 సీడ్ ఫ్రెంచ్ ఆటగాడు బ్రైస్ లీవర్‌డెజ్‌పై విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. 39 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ చక్కటి ఆటతీరు ప్రదర్శించాడు. మొదటి సెట్ ఇరువురి మధ్యా అసక్తికరంగా సాగింది. తొలి గేమ్‌లో 21-18తో ముందజవేసిన శ్రీకాంత్, రెండోసెట్‌లో ఆధిక్యాన్ని ప్రదర్శించి 21-14 స్కోరుతో బ్రైస్‌పై సునాయాస విజయం సాధించాడు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మ్యాచ్‌లో భారత టాప్ షట్లర్ పీవీ సింధు 22-20, 21-19 స్కోరుతో ప్రత్యర్థి స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్‌పై విజయం సాధించి సెమీస్‌కు అర్హత సాధించుకుంది. 52 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌నుంచే దూకుడుగా ఆడిన సింధు, విరామ సమయానికి 11-10 స్కోరుతో ఆధిక్యతలో ఉంది. ఒకదశలో ఇరువురి మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టు సాగింది. కరోలినా చక్కటి షాట్‌లు కొడుతూ, సింధు దూకుడును కట్టడి చేయడమే కాదు స్కోరును సమం చేస్తూ వచ్చింది. తరువాత ఆటవేగాన్ని పెంచిన సింధు 22-20తో మొదటి సెట్ సొంతం చేసుకుని ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది. ఆ తర్వాత ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వని సింధు 21-19 స్కోరుతో రెండో సెట్‌లో విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో చైనా టాప్ సీడ్ తై టీజుయింగ్‌తో సింధు తలపడనుంది.