క్రీడాభూమి

..ఆమె లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్లోరిడా, జూన్ 29: డోపింగ్ పరీక్ష నమూనాల సేకరణకు అమెరికా అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ దొరకలేదా? అంటే అవుననే అంటున్నారు. నమూనాల సేకరణకు యూఎస్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఆమె ఇంటికి వెళ్లినపుడు ఆమె అందుబాటులో లేదు. ఎదురుచూసిన యూఎస్‌ఏడిఏ సభ్యులు చివరకు నమూనాలు సేకరించకుండానే తిరుగుముఖం పట్టారట. ఆమె అందుబాటులో లేకపోవడంతో నమూనాలు తీసుకోకుండానే వెనుతిరిగినట్టు వుమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ సీఇవో స్టీవ్ సైమన్ విమానాశ్రయంలో అపరిచిత వ్యక్తికి ఫోన్ సమాచారం అందిస్తుండగా విషయం పొక్కింది.
గత 14న జరిగిన ఈ సంఘటన స్థానిక పత్రికల్లో కథనాలుగా రావడంతో యూఎస్‌ఏడీఏ దీనిపై స్పందించింది. ‘మా అంతట మేముగా ఎలాంటి వివరాలూ బయటకు పొక్కనివ్వం. ఎవరో మూడో వ్యక్తివల్ల ఇదంతా జరిగింది. ఆమెనుంచి ఇప్పటికే రెండుసార్లు నమూనాలు సేకరించాం. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మూడోసారి నమూనాల సేకరణకు వెళ్లినపుడు ఆమె అందుబాటులో లేదు. ఇంతకుమించి ఇందులో ఏమీ లేదు’ అంటూ యూఎస్‌ఏడీఏ అధికార ప్రతినిధి బ్రాడ్ పేర్కొనడం గమనార్హం.