క్రీడాభూమి

రెచ్చిపోయిన టీమిండియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డబ్లిన్, జూన్ 29: భారత బ్యాట్సమెన్లు రెచ్చిపోయారు. ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ-20లో పరుగుల విధ్వంసం సృష్టించారు. వరుస బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిపోయిన భారత్ 213 పరుగుల భారీ స్కోరు సాధించింది. లోకేష్ రాహుల్ (70, 36 బంతుల్లో మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు), సురేష్ రైనా (69, 45 బంతుల్లో 5్ఫర్లు, 3 సిక్సర్లు) చెలరేగిపోయారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి ప్రత్యర్థి జట్టుకు 214 టార్గెట్‌ను ఇచ్చింది. టాస్ గెలిచిన ఐర్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకోవడమే భారత్‌కు కలిసొచ్చినట్టయ్యింది. బ్యాటింగ్‌కు పిచ్ అనుకూలంగా ఉందని ముందే ప్రకటించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, భారీ స్కోరు సాధించాలని జట్టుకు నిర్దేశించాడు. ఇంగ్లాండ్‌తో తలపడబోయే టీ-20కు రిహార్సల్స్‌గా భావిస్తున్న ఐర్లాండ్ టీ-20ల్లో ప్రయోగాలు చేస్తానన్న కోహ్లి, అన్నట్టుగానే మ్యాచ్‌లో నలుగురు ఆటగాళ్లకు స్థానం కల్పించాడు. శిఖర్ ధావన్, ఎంఎస్ ధోనీ, భువనేశ్వర్, బుమ్రాలకు విశ్రాంతి కల్పించిన కోహ్లి, రాహుల్ శర్మ, దినేశ్ కార్తీక్, సిద్దార్థ్ కౌల్‌కు స్థానం కల్పించాడు. బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టులో లోకేష్‌రాహుల్‌తో కలిసి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లి 2.4 ఓవర్లకే పీటర్ చేజ్ బౌలింగ్‌లో డాక్రెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. లోకేష్ రాహుల్, సురేష్ రైనాల చెలరేగి 106 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. 12.1 ఓవర్ వద్ద బౌలింగ్ చేసిన కెవిన్ ఒబ్రెయిన్‌కే క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 13వ ఓవర్లో కెవిన్ ఒబ్రెయిన్ వరుసగా కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ వికెట్లు పడగొట్టడంతో భారత్ స్కోరు వేగం తగ్గింది. 15 ఓవర్లు ముగిసే సరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. విధ్వంసక బ్యాటింగ్ చేస్తున్న సురేష్ రైనాకు బ్రేక్ వేస్తూ ఒబ్రెయిన్ వికెట్ పడగొట్టడంతో 17.3 ఓవర్ వద్ద పెవిలియన్ దారి పట్టాడు. ఇన్నింగ్స్ చివరిలో రెచ్చిపోయిన హార్దిక్ పాండ్యా 32 (9 బంతుల్లో ఒక ఫోర్, 4 సిక్సర్లు), మనీష్‌పాండే 21 పరుగులతో అజేయంగా నిలిచారు. 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ జట్టు భారత్ బౌలింగ్ ధాటికి నిలవలేకపోయింది. 12.3 ఓవర్లకే 70 పరుగులతో కుప్పకూలింది. ఉమేష్‌యాదవ్ బౌలింగ్‌లో రైనాకు క్యాచ్ ఇచ్చి పాల్ స్టిర్లింగ్ ఒక్క పరుగు సాధించకుండానే పెవిలియన్ దారి పట్టాడు. 11 బంతుల్లో 14 పరుగులు సాధించిన (ఒక ఫోరు, ఒక సిక్స్) విలియం పోర్టర్ ఫీల్డ్, ఉమెష్ యాదవ్‌కు వికెట్ ఇచ్చాడు. ఏడు బంతుల్లో 2 పరుగులే సాధించిన జేమ్స్ షెనాన్, సిద్దార్ద్ కౌల్ బౌలింగ్‌లో లోకేష్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఏడు బంతుల్లో 9 పరుగులు సాధించిన ఆండ్రూ బాల్‌బిర్నీ యజువేంద్ర చాహల్‌కు వికెట్ ఇచ్చేశాడు. కెవిన్ ఓబ్రెయిన్ పరుగులు లేకుండానే హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో కులదీప్ యాదవ్‌కు క్యాచ్ ఇస్తే, నాలుగు బంతుల్లో ఐదు పరుగులు సాధించిన సిమిసింగ్, యుజువేంద్ర బౌలింగ్‌లో ఎల్బీడబ్యుతో వెనుతిరిగాడు. 16 బంతుల్లో 11 పరుగులు సాధించిన గారీ విల్సన్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. 8 బంతుల్లో 4 పరుగులు సాధించిన జార్జి డాక్రెల్ ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ క్యాచ్‌తో అవుటయ్యాడు. 10 బంతుల్లో 13 పరుగులు సాధించిన స్టార్ట్ థాంప్సన్, యజువేంద్ర బౌలింగ్‌లో అవుటయ్యాడు. 8 బంతుల్లో 10 పరుగులు సాధించిన బాండ్ రాంకిన్, దినేష్ కార్తీక్ బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్‌కు క్యాచ్ ఇవ్వడంలో ఐర్లాండ్ ఆట ముగిసింది.

చిత్రం..పరుగుల ఆనందం పంచుకుంటున్న సురేష్‌రైనా, కెఎల్ రాహుల్