క్రీడాభూమి

భారత్‌కు అగ్నిపరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రెడా (నెదర్లాండ్స్), జూన్ 29: వరుస విజయాలతో దూసుకెళ్లిన భారత హాకీ జట్టుకు ఆతిథ్య దేశం నెదర్లాండ్స్‌తో మ్యాచ్ ప్రాణ సంకటంగా మారింది. బ్రెడాలో జరుగుతున్న చాంపియన్స్ హాకీ ట్రోఫీ టోర్నమెంట్‌లో శుక్రవారం జరుగనున్న చివరి మ్యాచ్ భారత్‌కు అగ్నిపరీక్షే. ఆరు దేశాల జట్లు ఆడుతున్న రౌండ్ రాబిన్ టోర్నీలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లే ఫైనల్లో తలపడతాయి. వరుసగా ఎనిమిదిసార్లు ఒలింపిక్ చాంప్‌గా నిలిచిన భారత్‌తో శుక్రవారం లీగ్ చివరి మ్యాచ్‌లో నెదార్లాండ్స్ తలపడనుంది.
భారత్‌కు ఈ మ్యాచ్ కీలకం. గెలుపు అనివార్యం కూడా. కనీసం మ్యాచ్‌ను డ్రా చేస్తే తప్ప ఫైనల్ బెర్త్ ఖరారయ్యే అవకాశం లేదు. నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్ డ్రా చేసుకుంటే, 2016 చాంపియన్స్ ట్రోఫీలో చోటుచేసుకున్న పరిణామం పునరావృతం అవుతుంది. గురువారం బెల్జియంతో తలపడిన భారత జట్టు 1-1తో మ్యాచ్ డ్రా చేసుకుంది. దీంతో రెండు విజయాలు, ఒక పరాజయం, ఒక డ్రాతో ఏడు పాయింట్లు సాధించి రెండోస్థానంలో కొనసాగుతోంది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా పది పాయింట్లతో ఇప్పటికే ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ తరుణంలో రణదీప్‌సింగ్ గాయాలపాలవ్వడం భారత జట్టుకు ఒకరకంగా నష్టమే. మన్‌దీప్‌సింగ్, దిల్‌ప్రీత్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ ఆటతీరుపైనే భారత్ ఆశలు పెట్టుకుంది. ఆస్ట్రేలియా, బెల్జియంతో ఆడిన మ్యాచ్‌ల్లో డిఫెండర్లు అద్భుతంగా రాణించటం ఒకవిధంగా జట్టు మెరుగ్గా ఉందని చెప్పడానికి ఉపయుక్తమయ్యేదే. అనుభవజ్ఞుడైన పీఆర్ శ్రీశేష్ భారత్ జట్టు విజయంపై దృష్టి సారించాల్సి ఉంటుంది. భారత జట్టు ఒకింత ఆందోళనకు గురయ్యేదే పెనాల్టీల విషయంలోనే. హారేంద్రసింగ్ నాయకత్వంలోని భారత జట్టు శుక్రవారం జరిగే మ్యాచ్‌లో ఆతిథ్య నెదర్లాండ్స్ జట్టును నిలువరించగలిగితే, అగ్నిపరీక్షలో విజయం సాధించినట్టే.