క్రీడాభూమి

మహిళల హాకీ జట్టు ఎంపిక కెప్టెన్‌గా రాణిరాంపాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 29: లండన్‌లో జరగనున్న మహిళల వరల్డ్ కప్ హాకీ టోర్నీకి భారత జట్టు ఎంపికైంది. జూలై 21నుంచి జరుగనున్న టోర్నీ గ్రూప్-బిలో ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ (వరల్డ్ నెంబర్ 2) సహా యూఎస్ (వరల్డ్ నెంబర్ 7), ఐర్లాండ్ (వరల్డ్ నెంబర్ 16), భారత జట్లు ఉంటాయి. భారత జట్టుకు కెప్టెన్‌గా ఫార్వార్డ్ స్ట్రైకర్ రాణీ రాంపాల్, వైస్ కెప్టెన్‌గా గోల్ కీపర్ సవిత వ్యవహరిస్తారు. గాయాల కారణంగా విశ్రాంతిలోవున్న గోల్‌కీపర్ రజని ఎతిమార్పుకు జట్టులో అవకాశం దక్కడంతో జట్టు మరింత బలోపేతమైంది. జట్టు రక్షణశ్రేణిలో సునీతాలక్ర, దీప్‌గ్రేస్ ఎక్కా, దీపికలు ఆడతారు. డ్రాగ్ ఫ్లిక్కర్లు అయిన గురుజిత్ కౌర్, యువ క్రీడాకారిణి రీనా ఖోఖర్ జట్టులో స్థానం సంపాదించుకున్నారు. జట్టు ప్రధాన కోచ్ జియోర్డ్ మెరింజె మాట్లాడుతూ రాణిరాంపాల్ నాయకత్వంలో బలమైన భారత జట్టు ఎంపికైందన్నారు. ఆశించిన విధంగా భారత జట్టు మంచి ఫలితాలు రాబట్టగలదన్న ఆశాభావం వ్యక్తం చేశాడు.
భారత మహిళా హాకీ జట్టు:
గోల్ కీపర్లు సవిత (వైస్ కెప్టెన్), రజని ఎతిమార్పు. ఢిఫెండర్లు సునీతలక్రా, దీప్‌గ్రేస్ ఎక్కా, దీపిక, గుర్జీత్ కౌర్, రీనా ఖోఖార్. మిడ్ ఫిల్డర్లు నమిత టోప్పో, లీలిమా మింజ్, మోనికా, నేహా గోయాల్, నవజోత్ కౌర్, నిక్కి ప్రధాన్. ఫార్వర్డ్స్ రాణిరాంపాల్ (కెప్టన్), వందన కార్తీకేయ, నవనీత్ కౌర్, లాల్‌రేమ్ సియామి, ఉదిత.