క్రీడాభూమి

అర్జెంటీనా..అవుట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చావో రేవో పోరులో ఫ్రాన్స్ విజయం సాధించింది. ప్రత్యర్థి దాటికి నిలువలేని అర్జెంటీనా మైదానంలో మోకరిల్లింది. మెస్సీపై పెట్టుకున్న ఆశలు మాయమవడంతో, ప్రపంచ కప్‌నుంచే అర్జెంటీనా వైదొలిగింది. ‘మాది వీరోచిత పోరాటం’ అంటూ అర్జెంటీనా కోచ్ జార్జ్ సంపోలి చేసిన హెచ్చరికలు ఫ్రాన్స్ ఆటగాళ్లను భయపెట్టలేకపోయాయి. శనివారం మొదలైన నాకౌట్ సమరంలో అర్జెంటీనాపై ఫ్రాన్స్ 4-3తో విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరుకుంటే, అనూహ్యంగా ఓడిన అర్జెంటీనా మాత్రం ఫిఫా సమరం నుంచి నిష్క్రమించింది. అపార అనుభవమున్న మెస్సీ తన జట్టును ఏమాత్రం ఆదుకోలేకపోయాడు. అంతర్జాతీయ టోర్నీల్లో ఏమాత్రం అనుభవం లేని కుర్ర ఆటగాడు కిలియన్ ఎంబప్పె మాత్రం ఫ్రాన్స్‌ను అజేయస్థానంలో నిలబెట్టాడు.
*
కజన్ ఎరెనా, జూన్ 30: కిక్కిరిసిన కజన్ ఎరెనా స్టేడియం వేదికగా శనివారం సాయంత్రం 7.30కు ఫిఫా ప్రపంచకప్ నాకౌట్ రౌండ్ మొదలైంది. బరిలోకి దిగిన ఫేవరేట్ జట్లు ఫ్రాన్స్ -అర్జెంటీనాలు హోరాహోరీ పోరుకు తలపడ్డాయి. ఆద్యంతం ఉత్కంఠతో సాగిన మ్యాచ్‌లో కుర్ర ఆటగాడు కిలియన్ ఎంబప్పె చెలరేగిపోయాడు. రికార్డు గోల్స్‌తో అర్జెంటీనా ఆట కట్టించాడు. మ్యాచ్ ఆరంభం నుంచే ఫ్రాన్స్ ఆటాకింగ్ గేమ్‌కు దిగడంతో, అడ్డుకునేందుకు అర్జెంటీనా శతవిధాలా ప్రయత్నించింది. ఒక దశలో సమవుజ్జీగానే నిలబడినా, చివరి క్షణాల్లో రెచ్చిపోయిన ఫ్రాన్స్‌ను నిలువరించలేక చేతులేత్తేసింది. గెలుపే లక్ష్యంగా మ్యాచ్ ఆడిన ఫ్రాన్స్ 4-3తో అర్జెంటీనాపై విజయం సాధించింది. నాకౌట్ తొలి మ్యాచ్‌లో పందొమ్మిదేళ్ళ ప్యారిస్ జెర్మన్ స్టార్ ఎంబప్పె సెంటర్ అట్రాక్షన్ అయ్యాడు. 1958 ప్రపంచ కప్ మ్యాచ్‌లో పిన్న వయసులో రెండు గోల్స్ సాధించిన పీలే రికార్డును సమం చేసిన కుర్ర స్టార్‌గా నిలిచాడు. హోరాహోరీగా మొదలైన మ్యాచ్ 13వ నిమిషంలో గ్రీజ్‌మన్‌కు పెనాల్టీ అందడంతో సునాయాసంగా గోల్‌గా మలిచి ఫ్రాన్స్‌ను 1-0 ఆధిక్యంలో నిలబెట్టాడు. దీంతో అర్జెంటీనాపై వత్తిడి పెరిగింది. 41వ నిమిషంలో లాంగ్ రేంజ్ స్టన్నర్‌తో ఏంజిల్ డి మారియా గోల్ సాధించి ఫ్రాన్స్‌తో అర్జెంటీనాను సమం చేశాడు. రెండు జట్లకు మళ్లీ గోల్ లేకపోవడంతో ప్రథమార్థం 1-1 స్కోరుతో ముగిసింది. ద్వితీయార్థం ఆరంభంలోనే అర్జెంటీనాకు అనుకోని అవకాశం దక్కడంతో ఫ్రాన్స్‌పై పట్టు పెంచింది. మెస్సీ అందించిన లో కర్లింగ్ పాస్‌ను గాబ్రియెల్ మార్కడో అద్భుత గోల్‌గా మలచడంతో అర్జెంటీనా 2-1 ఆధిక్యానికి చేరుకుంది. అయితే 57వ నిమిషంలో డిఫెండర్ బెంజమిన్ గోల్ సాధించడంతో ఫ్రాన్స్, అర్జెంటీనాలు మళ్లీ సమమయ్యాయి. 64, 68 నిమిషాల్లో ఎంబప్పె అనూహ్యంగా వరుస గోల్స్ సాధించడంతో, మ్యాచ్‌పై అర్జెంటీనా ఆశలు వదిలేసుకుంది. మ్యాచ్ ముగిసే వరకూ మరో గోల్ సాధించేందుకు అర్జెంటీనా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఫ్రాన్స్ రక్షణ శ్రేణి అద్భుత ప్రావీణ్యాన్ని ప్రదర్శించి అర్జెంటీనాను పూర్తిగా నియంత్రణలో ఉంచింది. ఇంజ్యురీ టైం (90+3)లో అర్జెంటీనాకు ఒక్క గోల్ దక్కడంతో స్కోరు 4-3కి చేరింది. కానీ, అప్పటికే సమయం ముగిసిపోవడంతో అర్జెంటీనా ఓటమిని అంగీకరించక తప్పలేదు.