క్రీడాభూమి

క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన రష్యా జట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కోలో ఆదివారం జరిగిన ఫిఫా సాకర్ వరల్డ్ కప్ ప్రపంచ చాంపియన్‌షిప్ ప్రీ క్వార్టర్స్‌లో బలమైన స్పెయిన్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన రష్యా జట్టు. ఆతిథ్య దేశం కాబట్టి ఈ టోర్నీలో ఆడే అవకాశం వచ్చిందని, లేకపోతే, రష్యాకు ఆ సామర్థ్యం లేదని వచ్చిన విమర్శలకు ఈ విజయంతో సరైన సమాధానం ఇచ్చింది. ఇరు జట్లు తీవ్ర స్థాయలో పోటీపడిన ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడానికి పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది.
*
మాస్కో, జూలై 1: ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్స్ తొలి మ్యాచ్‌లో ఆతిధ్య రష్యా ప్రపంచ మాజీ చాంపియన్ స్పెయిన్‌ను మట్టికరిపించి తొలిసారిగా క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఆట ప్రారంభమైనప్పటి నుంచే ఇరు జట్లు బంతిని తమ నియంత్రణలో ఉంచుకునేందుకు హోరాహోరీగా తలపడ్డాయి. ఇందులో స్పెయిన్‌దే పైచేయి కావడంతో ప్రత్యర్థి గోల్ పోస్టులపై దాడులకు పూనుకుంది. ఈ నేపథ్యంలో ఆట 12వ నిమిషంలో రష్యా ఆటగాడు ఇగ్నా షెవిచ్ సెల్ఫ్ గోల్ చేయడంతో స్పెయిన్‌కు ఆధిక్యం లభించింది. 41 నిమిషంలో రష్యాకు పెనాల్టీ లభించడంతో జట్టు ఫార్వర్డర్ జ్యూబా స్కోరు 1-1తో సమం చేశాడు. తొలి అర్ధ భాగం వరకు మరో గోల్ నమోదు కాలేదు. రెండో అర్ధ్భాగం ప్రారంభం నుండి గోల్ కోసం ఇరు జట్లు గోల్ పోస్టులపై దాడులు సిద్ధమయ్యాయి. ఎటాకింగ్ గేమ్ ఆడినా ప్రయోజనం లేకపోయింది. ఆట ముగిసేవరకు ఇరు జట్లు రెండో గోల్‌ను సాధించలేకపోయాయి. దీంతో తొలిసారిగా షూటౌట్ కోసం అదనపుసమయం ఇచ్చారు. ఇచ్చిన 30 నిమిషాల అదనపు సమయంలో కూడా బలమైన స్పెయిన్‌ను రష్యా ఆటగాళ్లు అడుగడుగునా అడ్డుకున్నారు. అదనపు సమయం వచ్చినా ఫలితం తేలకపోవడంతో మ్యాచ్ పెనాల్టీకి దారితీయడంతో స్పెయిన్‌కు 3 పెనాల్టీలు, రష్యాకు నాలుగు పెనాల్టీలు దక్కడంతో 4-3 తేడాతో రష్యా విజయం సాధించింది. స్పెయిన్ ఇప్పటికే మూడుసార్లు (1986లో బెల్జియం, 2002లో దక్షిణ కొరియా, 2018లో రష్యా) ప్రపంచ కప్ టోర్నమెంట్లలో పెనాల్టీ షూటౌట్లను కోల్పోయింది. ఆతిధ్య రష్యా తొలిసారిగా ఐదు పెనాల్టీ షూటౌట్‌లను అవకాశంగా మలచుకుని విజయం సాధించింది. సోవియట్ యూనియన్ రష్యా ఇంతకుముందు ఎన్నడూ స్పెయిన్‌ను ఓడించిన దాఖలాలు లేవు. అయితే, 2017 నవంబర్‌లో జరిగిన ఫ్రెండీ మ్యాచ్‌లో మాత్రం 3-3తో స్కోరు సమం అయ్యాయి. స్పెయిన్ ఇంతవరకు రష్యాతో ఆడిన మూడు గేమ్స్‌లో 10 గోల్స్ చేసింది.
చిత్రం..పెనాల్టీ షూటౌట్‌తో రష్యాను క్వార్టర్ ఫైనల్స్‌కు చేర్చిన గోల్‌కీపర్ ఎల్గర్ అకిన్‌ఫీవ్‌ను అభినందనలతో ముంచెత్తుతున్న సహచరులు