క్రీడాభూమి

జపాన్‌పై పైచేయి కోసం బెల్జియం తహతహ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రొస్టోవ్ ఆన్ డన్ (రష్యా), జూలై 1: ఫిఫా వరల్డ్ కప్ చాంపియన్ షిప్‌లో భాగంగా సోమవారం జరిగే ప్రీ కార్టర్ ఫైనల్స్‌లో జపాన్‌పై తప్పకుండా పైచేయి సాధిస్తామని బెల్జియం గట్టి ధీమాతో ఉంది. అయితే, ఇందుకు ఆటగాళ్లంతా ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా తగిన జాగురూకతతో వ్యవహరించాలని జట్టు కెప్టెన్ డ్రీస్ మెర్టెన్స్ హెచ్చరించాడు. వరల్డ్ కప్ చరిత్రలో చాపకింద నీరులా ప్రవేశించిన బెల్జియం అన్ని లీగ్ మ్యాచ్‌లను సునాయాసంగా దాటుకుని ఎట్టకేలకు ప్రీ క్వార్టర్స్‌లో ప్రవేశించింది. తమ ప్రారంభ మ్యాచ్‌లలో పనామా, తునీషియా జట్లను ఓడించి, గ్రూప్-జిలో ఇంగ్లాండ్‌తో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 1-0తో ఆ జట్టును ఓడించిన బ్రెజిల్‌కు జపాన్ గట్టి పోటీ ఇస్తుందని క్రీడా పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రత్యర్థి ఆటతీరు తమ ఎన్నో ఏళ్ల నుండి తెలుసునని, వారిని తాము తక్కువగా అంచనా వేయబోమని అంటూ, అందరి అంచనాలను తారుమారు చేసి క్వార్టర్ ఫైనల్స్‌లో చోటు దక్కించుకుంటామన్న ధీమాను వ్యక్తం చేశాడు. తమ జట్టులోని స్టార్ స్ట్రయికర్ రొమేలు లుకాకుపైనే జట్టు భారమంతా వేసింది. అతను ఆడిన మ్యాచ్‌లలో తునీషా, పనామాపై మొత్తం నాలుగు గోల్స్ చేసి చేయడం ద్వారా జట్టు గ్రూప్ స్టేజీలను దాటి ప్రీక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. ఇపుడు ఇందులోనూ ప్రత్యర్థి జపాన్‌కు గట్టి పోటీ ఇచ్చి సత్తా చూపుతామని జట్టు గట్టి నమ్మకంతో ఉంది.