క్రీడాభూమి

హాకీ చాంప్ ఆస్ట్రేలియా ఫైనల్‌లో 3-1తో భారత్‌పై గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రెడా (నెదర్లాండ్స్), జూలై 1: హాకీ చాంపియన్ ట్రోఫీ విజేతగా ఆస్ట్రేలియా టైటిల్‌ను దక్కించుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌ను 3-1తో ఓడించింది. ఆట ప్రారంభమైనప్పటి నుంచి ఇరు జట్లు ఆధిపత్యం కోసం హోరాహోరీగా తలపడ్డాయి. 24వ నిమిషంలో ఆస్ట్రేలియా ఆటగాడు బ్లేక్ గోవెర్స్ తొలి చేసి జట్టుకు ఆధిక్యం అందించాడు. దీంతో ఒత్తిడిలో పడిన భారత్ గోల్ కోసం తీవ్రంగా శ్రమించింది. 43వ నిమిషంలో భారత్ ఆటగాడు వివేక్ సాగర్ తొలి గోల్ చేసి ఇరు జట్ల స్కోరును 1-1తో సమం చేశాడు. ఆ తర్వాత మరో గోల్ కోసం ఇరు జట్లు జరిపిన పోరు షూటౌట్‌కు దారితీసింది. దీంతో చెలరేగిన ఆసిస్ 3-1తో ఆధిక్యంతో నిలిచి చాంపియన్ ట్రోఫీని కైవసం చేసుకుంది.