క్రీడాభూమి

భవిష్యత్‌పై రొనాల్డో నోకామెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోచి (రష్యా), జూలై 1: రష్యాలో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో ఓటమితో టోర్నమెంట్ నుంచే నిష్క్రమించిన పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో భవిష్యత్తు అంతర్జాతీయ వేదికలపై ఆడే అంశంపై మాట్లాడేందుకు ఇష్టపడలేదు. లీగ్ దశ నుంచి జట్టును నాకౌట్ వరకు తీసుకెళ్లగలిగిన రొనాల్డో శనివారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో ఉరుగ్వే చేతిలో 2-1 తేడాతో ఓడిపోయి ప్రపంచవ్యాప్తంగా తనను ఎంతగానో అభిమానించే వేలాది మద్దతుదారులు, అభిమానుల ఆశలను పటాపంచలు చేశాడు. ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో ఉరుగ్వే సంచలన ఆటగాడు ఎడిన్‌సన్ కవానీ రెండు గోల్స్ చేయడంతో జట్టు విజయతీరాలకు చేరుకుంది. అయితే, తమ జట్టు నాకౌట్‌లో తిరుగుటపా కట్టడంతో జీర్ణించుకోలేకపోతున్న రొనాల్డో భవిష్యత్తుపై తమ యూరోపియన్ చాంపియన్స్‌కు ఎంతో నమ్మకం ఉందని, రానున్న రోజుల్లో జట్టు మరింత బలపడుతుందని అన్నాడు.