క్రీడాభూమి

కొత్త స్టార్లు వస్తున్నారు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కజాన్ (రష్యా), జూలై 1: ఫుట్‌బాల్ చరిత్రలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న స్టార్ ఆటగాళ్లు లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా), క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్) ప్రస్తుతం జరుగుతున్న రష్యా వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో ఏమాత్రం సత్తా చూపలేకపోయారు. లీగ్ దశ నుంచి ఆపసోపాల మధ్య తమ తమ జట్లను నాకౌట్ దశ వరకు తీసుకెళ్లగలిగిన ఈ మేటి దిగ్గజాలు తమ పేలవమైన ఆటతీరుతో అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశారు. శనివారం నాకౌట్‌లో భాగంగా జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో అర్జెంటీనా 3-2 తేడాతో ఫ్రాన్స్ చేతిలో చిత్తు కాగా, అదేరోజు జరిగిన మరో మ్యాచ్‌లో పోర్చుగల్ 2-1 తేడాతో ఉరుగ్వే చేతిలో ఓటమిని చవిచూసింది. దీంతో ఎంతోమంది అభిమానులు, మద్దతుదారులు మెస్సీ, రొనాల్డోపై పెట్టుకున్న ఆశలు అడియాశలై చివరకు నాకౌట్ తొలిరోజే ఇంటిముఖం పట్టారు. మెస్సీ, రొనాల్డో తమ తమ జట్ల తరఫున ప్రాతినిధ్యం వహించినా లీగ్ మొదలుకుని నాకౌట్ వరకు వీరిద్దరూ కనీసం ఒక్క గోల్ కూడా చేయడంలో విఫలమయ్యారు. ఇది వారి అభిమానులు, మద్దతుదారులకు కొరకరాని కొయ్యిగా తయారైంది. కాగా, అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ సంచలన ఆటగాడు 19 ఏళ్ల ఎంబప్పె తన అద్భుత ఆటతీరుతో రెండు గోల్స్ చేసి జట్టును విజయం పథంలో నిలిపడం ద్వారా ఇపుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
ఎంబప్పె ఆటలో చూపించిన దూకుడు, చురుకుగా పరుగెత్తే తత్వం భవిష్యత్తులో మంచి స్టార్ ఆటగాడిగా ఎదిగేందుకు దోహదపడతాయని క్రీడా పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుత వరల్డ్ కప్‌లో ఎంబప్పె ఆడిన మూడు లీగ్ మ్యాచ్‌లు, ఒక నాకౌట్ మ్యాచ్ ద్వారా మొత్తం నాలుగు గోల్స్ చేశాడు. 1958లో ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు పీలే 17 ఏళ్ల వయసులో సాధించిన నాలుగు గోల్స్ ఘనతను ఇపుడు ఫ్రాన్స్ టీనేజర్ ఎంబప్పె సమం చేశాడు. లీగ్ దశలో జరిగిన ఒక మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా అవార్డు దక్కించుకున్న ఎంబప్పె తనను బ్రెజిల్ స్టార్ ఆటగాడు పీలేతో పోల్చడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. అటువంటి దిగ్గజ ఆటగాళ్ల సరసన ఘనత సాధించడం మరపురాని ఘట్టమని ఆయన అన్నాడు.